Maatamanti

Strawberry Rava laddu recipe-స్ట్రాబెర్రీ లతో రవ్వలడ్డు చేయడం ఎలా?

Strawberry Rava laddu recipe with step by step instructions.English Version.

నేను మా ఇంట్లో నెలకి రెండు సార్లన్నా రవ్వ లడ్డ్లు తయారు చేస్తుంటాను.ఎందుకంటే అవంటే మా అమ్మాయికి చాలా  ఇష్టం.కానీ ఎప్పుడూ ఒకలానే ట్రై చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?అందుకే ఈసారి కాస్త విభిన్నంగా తయారు చేయాలనుకున్నాను.ఆ రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళినపుడు చాలా తాజాగా ఉన్న స్ట్రాబెర్రీలు కనిపించాయి.వెంటనే 2 పాకెట్లు కొన్నాను.ఇంటికొచ్చాక స్ట్రాబెర్రీ లతో రవ్వ లడ్లు చేస్తే ఎలా ఉంటుందా అని అలోచించి నెట్ లో ఎక్కడైనా ఈ recipe ఉందేమోనని వెదికాను.కానీ ఎక్కడా దొరకలేదు.ఇక నేనే స్వంతంగా తయారు చేయాలనుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని వెంటనే తయారు చేసాను.చాలా బాగా కుదిరాయి.

వెంటనే వీడియో ని ఎడిట్ చేసి అప్ లోడ్ చేద్దామనుకున్నాను.కానీ స్ట్రాబెర్రీలు అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో దొరకవు కదా, మరి అప్పుడెలా అని అలోచించాను.అప్పుడే స్ట్రాబెర్రీ ఫ్రూట్ క్రష్ తో గానీ, జామ్ తో గానీ తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.అలా కూడా చేసాను.అవి కూడా బాగా కుదిరాయి.కాకపోతే స్ట్రాబెర్రీ క్రష్ తో తయారు చేసిన  లడ్డూలు  కాస్త రంగు ఎక్కవగా ఉంటాయి.ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కుడా బాగా తెలుస్తుంది.

ఒకవేళ మీరు ఈ లడ్డూలని తాజా బెర్రీ లతో చేయాలనుకుంటే 3/4 కప్పు పంచదార వేయాల్సి ఉంటుంది.అదే స్ట్రాబెర్రీ క్రష్ తో తయారు చేస్తే 1/2 కప్పు పంచదార వేస్తే సరిపోతుంది.ఎందుకంటే ఆ క్రష్ లో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి.పైన చెప్పిన రెండు పద్ధతుల్లో మీరు ఏది చేసినా స్తాబెర్రీ గుజ్జులో కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలి.వేడిగా అప్పుడే తయారు చేసిన స్ట్రాబెర్రీ సాస్ లో ఆరకముందే పాలు పోస్తే, పాలు విరిగిపోతాయి.

నేను ఈ సారి ఈ లడ్డూలను పైన్ ఆపిల్ క్రష్ తో గానీ, లిచ్చీ తో గానీ తయారు చేద్దామనుకుంటున్నాను.ఒకవేళ బాగుంటే మీకు తప్పకుండా తెలియజేస్తాను.నోరూరించే ఈ రుచికరమైన Strawberry Rava laddu recipe మీరు కూడా తయారు చేసి ఆ రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

బిస్కెట్ లతో కేక్ తయారు చేయడం ఎలా?
వెజిటెబుల్ కట్లెట్ తయారు చేయడం ఎలా?
మునక్కాడ టమాటో కూర తయారీ విధానం
హైదరాబాదీ ప్రాన్స్ బిరియాని చేయడం ఎలా?
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?

 Click here for the English Version of this Recipe

Strawberry Rava laddu recipe
Prep Time
10 mins
Cook Time
20 mins
Total Time
30 mins
 
Course: Dessert
Cuisine: Andhra, Indian
Servings: 11
Ingredients
విధానం 1
  • 1 కప్పు బొంబాయి రవ్వ
  • ½ కప్పు ఎండుకొబ్బరి పొడి
  • ½ కప్పు పంచదార
  • ¼ కప్పు నెయ్యి
  • ¼ కప్పు స్ట్రాబెర్రీ క్రష్ లేదా జామ్
  • 3 tbsp పాలు కాచి చల్లార్చినవి
  • ¼ కప్పు జీడిపప్పు
  • ¼ కప్పు బాదంపప్పు
  • 1 tsp యాలుకల పొడి
  • ¼ కప్పు కిస్ మిస్
  • 1 tbsp పిస్తాపప్పు తురుము
విధానం 2
  • 1 కప్పు బొంబాయి రవ్వ
  • ½ కప్పు ఎండుకొబ్బరి పొడి
  • ¾ కప్పు పంచదార
  • ¼ కప్పు నెయ్యి
  • 5 స్ట్రాబెర్రీలు
  • 3 tbsp పాలు కాచి చల్లార్చినవి
  • ¼ కప్పు జీడిపప్పు
  • ¼ కప్పు బాదంపప్పు
  • 1 tsp యాలుకల పొడి
  • ¼ కప్పు కిస్ మిస్
  • 1 tbsp పిస్తాపప్పు తురుము
Instructions
తయారీ విధానం 1
  1. ఒక పెనంలో నెయ్యి వేసి వేడిచేయాలి.
  2. జీడి పప్పు, కిస్ మిస్ వేసి చక్కటి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  3. అందులో బొంబాయి రవ్వ వేసి 3-5 నిమిషాలు సన్నని సెగ మీద వేయించాలి.
  4. తర్వాత ఎందు కొబ్బరి పొడి, యాలుకల పొడి, బాదం పప్పు తురుము, పంచదార వేసి ఒక రెండు నిమిషాలు సన్నని సెగ మీద కలిపి దించేసుకోవాలి.ఆ మిశ్రమాన్నికొద్ది నిమిషాల పాటు పూర్తిగా కాకుండా కొద్దిగా చల్లారనివ్వాలి.
  5. ఈలోపుగా ఒక చిన్న గిన్నెలో స్ట్రాబెర్రీ క్రష్ గానీ, జామ్ గానీ వేసి దాన్ని ఒకసారి కలపాలి.
  6. అందులో 3 tbsp ల కాచి చల్లార్చిన పాలు వేసి కలిపి దాన్ని రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
  7. ఇప్పుడు చేతి నిండా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూ లను చుట్టాలి.
  8. వాటిని ఎండు కొబ్బరి పొడిలో దొర్లిస్తే చూడడానికి బాగుంటాయి.
తయారీ విధానం 2
  1. 5 లేదా 6 స్ట్రాబెర్రీ తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  2. ఆ ముక్కల్ని ఒక చిన్న సాస్ పాన్ లోకి తీసుకొని అందులో 3 నుండి 4 tbsp ల నీరు పోయాలి.
  3. ఆ గిన్నెని స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తగా గుజ్జులా అయ్యేవరకు ఉడికించాలి.
  4. మంచి రంగు మరియు రుచి కొరకు కావాలంటే 1 tsp స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకోవచ్చు.వేయకపోయినా పర్వాలేదు.
  5. స్టౌ కట్టేసి ఈ సాస్ ని పూర్తిగా చల్లారనివ్వాలి.చల్లారాక అందులో 2-3 tbsp ల కాచి చల్లార్చిన పాలు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.
  6. ఇక రవ్వ లడ్డు మిశ్రమాన్ని తయారు చేయడానికి పైన చెప్పిన విధానాన్ని అనుసరిస్తే సరిపోతుంది.
  7. కాకపోతే ఈ విధానం లో పంచదార ¾ కప్పు వేయాలి.పైన చెప్పిన విధానంలో స్ట్రాబెర్రీ క్రష్ వాడినాము కనుక అక్కడ ½ కప్పు సరిపోతుంది.

Strawberry Rava laddu recipe Video

 

Related Post

Please Share this post if you like