Maatamanti

Saggubiyyam Punugulu – సగ్గుబియ్యంతో పునుగులు తయారీ

Saggubiyyam Punugulu recipe with step by step instructions.English Version.

 

సగ్గుబియ్యంతో వడలు, పాయసం చేస్తారని తెలుసు.కాని వీటితో పునుగులు కూడా చేయొచ్చని మొన్న మా నానమ్మ చెప్తే తెల్సింది.recipe అడిగి రాసుకున్నాను.ఎలా వస్తాయో తెలీదు కాబట్టి ముందు ఒకసారి ట్రై చేసి చూసాను.చాలా బాగా కుదిరాయి.అందుకే బ్లాగ్ లో అప్ లోడ్ చేయడం కోసం మళ్ళి చేసాను.

ఎంతో రుచిగా ఉండే పునుగుల్ని తినాలని ఎవరికుండదు చెప్పండి?తినాలని ఉన్నా చేసుకునే తీరిక ఎవరికుంది ఇప్పుడు.అదే మా చిన్నప్పుడు అయితే కనీసం వారంలో ఒక సాయంత్రం అయినా మా అమ్మ పునుగులు చేసి పెట్టేది.లేకపోతే friends తో కలిసి వెళ్లి బజ్జీలు, పునుగులు అమ్మే బండి వాడి దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం.వేడి వేడి పునుగుల మీద కారం పొడి జల్లి, కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు, పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీ వేసి ఇచ్చేవాడు.అవి తింటూ మా friends అందరం కబుర్లు కబుర్లు చెప్పుకునేవాళ్ళం.నిజంగా అవి ఎన్నటికీ మరచిపోలేని రోజులు.

ఈ పునుగులు మామూలు మినప పిండి పునుగుల్లా కాకుండా కొంచెం సాగినట్లుగా ఉంటాయి.ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కొద్దిగా సాగినట్లుగా అవుతాయి కదా.కానీ రుచి  మాత్రం అద్భుతంగా ఉంటుంది.చట్నీ లాంటివి లేకుండా ఉట్టిగా తిన్నా కుడా బాగుంటాయి.

పిండి తయారు చేసుకునేటపుడు కొంచెం జాగ్రత్తగా తయారు చేస్తే సరిపోతుంది.పిండి ఏమాత్రం జారుగా ఉన్నా పునుగులు ఎక్కువగా నూనె పీలుస్తాయి.అందుకే కొంచెం గట్టిగా కలుపుకోండి.పల్లీ చట్నీ కానీ, టమాటో చట్నీ తో గానీ తింటే రుచిగా ఉంటాయి.కొద్దిగా కారప్పొడి, నెయ్యి కలుపుకొని దానితో తిన్నా బాగుంటాయి.మీరు కూడా ఈ recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

you may also like

How to Ulavacharu at home in Telugu
Vegetable Cutlets Recipe in Telugu
Banana Balls Recipe for Kids in Telugu
Flax seeds Laddu Recipe in Telugu
Bread Pizza Recipe in Telugu
Onion Murukulu Recipe in Telugu

English version of this recipe —  Click here

క్యాలిఫ్లవర్ పచ్చడి

Saggubiyyam Punugulu in Telugu
Prep Time
30 mins
Cook Time
30 mins
Total Time
1 hr
 

Punugulu or Bonda recipe made with Saggubiyyam or sabudana 

Course: Appetizer, Breakfast, Snack
Cuisine: Andhra
Servings: 6
Author: Bindu
Ingredients
  • 3/4 కప్పు సగ్గుబియ్యం
  • 1/2 కప్పు మైదా పిండి
  • 3 tbsp కొబ్బరి పొడి
  • 1/3 కప్పు పెరుగు
  • 3/4 కప్పు నీళ్ళు
  • 1 చిన్న ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిరపకాయ ముక్కలు
  • 1 tsp వంట సోడా
  • 1 tsp జీలకర్ర
  • 1/4 కప్పు కొత్తిమీర తరుగు
  • 1 రెమ్మ కరివేపాకులు
  • తగినంత ఉప్పు
  • వేయించడానికి సరిపడా నూనె
Instructions
నానబెట్టుట
  1. సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.

  2. 1/3 కప్పు పెరుగుని ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టి 3/4 కప్పు నీళ్ళు పోసి మజ్జిగలా చేసుకోవాలి

  3. కడిగిన సగ్గుబియ్యాన్ని మజ్జిగలో పోసి 30 నిమిషాలు నాననివ్వాలి

పునుగుల మిశ్రమం తయారీ
  1. అరగంట తర్వాత సగ్గుబియ్యం మజ్జిగని పిల్చేసుకొని ఉబ్బినట్లుగా అవుతాయి.ఒకసారి కొద్దిగా గరిటెతో కదిపి చూడండి.మజ్జిగ కనుక ఇంకా మిగిలి ఉంటే దాన్ని వంపేయాలి.

  2. సగ్గుబియ్యంలో మైదాపిండి, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, సోడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

  3. ఈ పిండి పునుగులు పిండి మాదిరి ఉండలుగా జారవిడవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి.ఒక వేళ పిండి కనుక జారుగా అయితే కొద్దిగా మైదా పిండి కలిపి సరిచేసుకోవచ్చు.

వేయించుట
  1. బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి అది కాగాక, పునుగుల పిండిని చిన్న నిమ్మకాయలంతా పరిమాణంలో నూనెలో మెల్లగా జారవిడవాలి.

  2. చక్కటి బంగారు రంగులోకి మారేవరకు వేయించి పేపర్ టవల్ లోకి తీసుకోవాలి

  3. వేయించేటపుడు సగ్గుబియ్యం కొద్దిగా ఉబ్బినట్లయి పేలే అవకాశం ఉంది.కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Saggubiyyam Punugulu recipe video

Related Post

Please Share this post if you like