Maatamanti

Prawns Pulao Telugu Recipe-రొయ్యల పులావు తయారీ

Prawns Pulao Telugu Recipe with step by step instructions.English Version.

రెగ్యులర్ గా చికెన్, మటన్ కూరలు తినీ తినీ కాస్త బోర్ కొట్టినప్పుడు ఇలా రొయ్యలతో పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.ఇది బాచిలర్స్ కూడా తయారు చేసుకో గలిగిన తేలికైన వంటకం.రొయ్యలను శుభ్రంగా కడిగి, మసాలాలు పట్టించి ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత కూరలా వండి, సరిపడా నీళ్ళు పోసాక, అప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి సరిగ్గా ఉడికే వరకు వండాలి.

ఈ recipe చిన్న రొయ్యలతో కాకుండా కాస్త పెద్ద సైజు రొయ్యలతో చేస్తే బాగుంటుంది.చిన్న రొయ్యలైతే కూరలో వేయగానే మరికాస్త చిన్నగా అవుతాయి.పులావు లో కనిపించకుండా ఉంటాయి.అవి వేపుడు చేసుకోవడానికి మాత్రం బాగుంటాయి.అందుకే నేను మరీ టైగర్ prawns లేదా చిన్న నాటు రొయ్యలు కాకుండా మీడియం సైజు వి తీసుకున్నాను.రొయ్యల్ని శుభ్రం చేసే టప్పుడు నల్ల తీగను లాగేయాలి.ఇంకా నీచు వాసన పోవడానికి ఒక 5 నిమిషాల పాటు పసుపు కలిపిన మజ్జిగలో నానబెట్టాలి.

నేను prawns ని మారినేట్ చేసేటప్పుడు కారంతో పాటు 2 tbsp ల పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేశాను.రొయ్యలు సహజంగా కాస్త తియ్యని రుచిని కలిగి ఉంటాయి.మనం వాటిని వండేటప్పుడు ఎంత కారం వేసినా తినేటప్పుడు కారంగానూ ఉంటుంది, రొయ్యని నమిలినప్పుడు తీపి కూడా అనిపిసస్తుంది.ఎండు కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను డానికి బదులుగా పచ్చి మిర్చి పేస్ట్ వేశాను.కానీ మీకు ఇష్టం లేకపోతే కారమే వేసుకోవచ్చు.

కొంతమంది frozen prawns ఉపయోగిస్తారు.వాటిని ఉపయోగించే ముందు సరిగ్గా defrost చేయడం అవసరం.లేకపోతే prawns వండాక గట్టిగా  రబ్బరు ముక్కల్లా అవుతాయి.ఎంతైనా frozen prawns తో కన్నా ఫ్రెష్ prawns తో చేసిన పలావ్ రుచిగా ఉంటుంది.ప్రాన్స్ pulao recipe ని దాల్చా తో గానీ, చికెన్ కర్రీ తో గానీ వడ్డిస్తే బాగుంటుంది.ఈ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

 

మీకు నచ్చే మరికొన్ని వంటలు

MuttonBiryani Recipe in Telugu
Chicken TIkka Pulao Telugu Recipe
Hyderabadi Prawns Biryani recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Vegetable Sambar Recipe in Telugu
Chicken Liver Fry in Telugu
Chinese Egg Noodles Recipe in Telugu

Click here for the English Version of the Recipe

Prawns Pulao Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
30 mins
Total Time
1 hr
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Servings: 3
Author: బిందు
Ingredients
మారినేషన్ కొరకు
  • 350 గ్రాములు పెద్ద రొయ్యలు
  • 1 ½ tsp ఉప్పు
  • ½ tsp పసుపు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • 2 tbsp పచ్చి మిర్చి ముద్ద
  • 1 tsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 రెమ్మ పుదీనా
నానబెట్టుటకు
  • 3 కప్పులు లేదా ౩౭౫ గ్రాములు బాస్మతి బియ్యం( 1 కప్ = 125 గ్రాములు)
  • నానబెట్టుటకు సరిపడి నన్ని నీళ్ళు
కూర కొరకు
  • 4 tbsp నూనె
  • 1 tbsp నెయ్యి
  • 2 బిర్యానీ ఆకులు
  • 1 అనాస పువ్వు
  • 2 ఏలకులు
  • 2 దాల్చిన చెక్కలు అంగుళం పొడవు
  • 4 లవంగాలు
  • 1 పువ్వు జాపత్రి
  • 1 ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగినది
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 టమాటో
  • ½ tbsp ధనియాల పొడి
  • ఏలకులు మరియు సోంపు పొడి
  • 1 tsp పలావు మసాలా
  • ¼ కప్ కొత్తిమీర
  • చేతి నిండా పుదీనా ఆకులు
మసాలా కొరకు
  • 3 ఏలకులు
  • 1 tsp సోంపు
పలావు కొరకు
  • 4 ½ కప్పులు లేదా 700 ml నీళ్ళు
  • ¼ కప్పు పుదీనా
  • ¼ కప్పు కొత్తిమీర
Instructions
మారినేట్ చేయుట
  1. రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
  2. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు నాననివ్వాలి.
బియ్యం నానబెట్టుట
  1. రొయ్యలకు మసాలా పట్టించడం అవగానే బియ్యాన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టాలి.
  2. బియ్యం నానిన తరవాత వండే ముందు 2 నుండి 3 సార్లు స్టార్చ్ పోయే వరకు శుభ్రంగా కడగాలి.
మసాలా తయారీ
  1. ఏలకులు మరియు సోంపు ను ఒక పెనంలో దోరగా వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
కూర వండుట
  1. ఒక పాత్రలో నూనె మరియు నెయ్యి వేసి వేడి చేయాలి.
  2. అందులో బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, ఏలకులు, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
  6. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఏలకులు మరియు సోంపు పొడి, పలావు మసలా వేసి బాగా కలపాలి.
  7. మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు, కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి 15 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
పలావు తయారీ
  1. బియ్యాన్ని కొలవడానికి వాడిన కప్పుతోనే ప్రతీ 1 కప్పు బియ్యానికి 1 ½ కప్పు చప్పున నీళ్ళు పోయాలి.
  2. నీళ్ళలో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి మరిగే వరకు ఉడికించాలి.
  3. నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.
  4. అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
  5. ఉడకడం మొదలవగానే ఒకసారి ఉప్పు సరి చూసుకొని, పైన మూత పెట్టి సిమ్ లో ఉంచి అన్నం సరిగ్గా ఉడికే వరకు వండి స్టవ్ కట్టేయాలి.

Prawns Pulao Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=AOMcIWSJ9zI[/embedyt]

Related Post

Please Share this post if you like