Maatamanti

Prawns Biryani Telugu Recipe-ప్రాన్స్ బిర్యానీ తయారీ విధానం

Prawns Biryani Telugu Recipe with step by step instructions.English Version.

ఒక్క సారి కూడా బిర్యానీ రెసిపీ ని తయారు చేయని వారు మొదటి సారిగా ట్రై చేయాలనుకుంటే ప్రాన్స్ లేదా వెజిటేబుల్ బిర్యానీ లు బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే బిర్యానీ ఫస్ట్ attempt లోనే పర్ఫెక్ట్ గా కుదరకపోవచ్చు.ఎంతైనా ఒక  రెండు మూడు సార్లు చేస్తేనే గాని బాగా కుదరదు.ప్రాన్స్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లు చేయడం కొద్దిగా సులువు.ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ.

మరీ చిన్నవి లేదా నాటు రొయ్యలు కాకుండా కాస్త మీడియం సైజు లేదా పెద్ద రొయ్యలతో బిర్యానీ చేస్తే బాగుంటుంది.తాజా రొయ్యలతో చేస్తే మంచిది.ఒక వేళ ఫ్రోజెన్ ప్రాన్స్ ఉపయోగించాల్సి వస్తే అవి పూర్తిగా రూమ్ టెంపరేచర్ కి వచ్చాక మాత్రమే మారినేట్ చేసుకోవాలి.లేకపోతే రొయ్యలు గట్టిగా అయిపోయి బిర్యానీ అసలు బాగోదు.

కుదిరితే ముందు రోజు రాత్రే మీరు రొయ్యల్ని మారినేట్ చేసి ఫ్రిజ్ లో  పెట్టుకుని మరుసటి రోజు బిర్యానీ తయారు చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల చాలా సమయం కూడా ఆదా అవుతుంది.కాకపొతే ఉపయోగించడానికి గంట ముందే prawns మారినేడ్ ని ఫ్రిజ్ లో నుండి తీసి బయట పెట్టుకోవాలి.

ప్రాన్స్ కి మసాలాలు పట్టించాక(మారినేట్ ) చేశాక ఒకసారి ఆ మసాలా ని రుచి చూడాలి.మారినేడ్ ని టేస్ట్ చేసినప్పుడే దాని రుచి బిర్యానీ లా అనిపిస్తుంది.కాకపొతే ఉడికించని బిర్యానీ లా ఉంటుంది.అందుకనే రుచి చూడగానే ఏవైనా మసాలాలు అటు ఇటు అయినా కొద్దిగా వేసి సరి చేసుకోవాలి.కొంత మందికి కారంగా తింటారు.వాళ్ళు ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు.

బిర్యానీ ని స్టవ్ మీద పెట్టాక అక్కడే ఉండడం మంచిది.వదిలేసి పక్కకి వెళ్ళిపోతే మాడిపోయే ప్రమాదం ఉంది.అందుకే మీకు చేయడం కాస్త అలవాటయ్యే వరకు స్టవ్ దగ్గరే ఉండి గమనించడం మంచిది.నేను పలచటి పెరుగు వేశాను.ఒక వేళ మీరు గడ్ద పెరుగు వేశారనుకోండి అందులో తడి శాతం తక్కువగా ఉండడం వల్ల బిర్యానీ తొందరగా అడుగంట వచ్చు.బిర్యానీ పాత్ర తక్కువ మందంగా ఉన్నా కూడా అడుగంట వచ్చు.సరిపడినంత నూనె వేయకపోయినా అడుగంటే ప్రమాదం ఉంది.కాబట్టి ఇవన్నీ సరి చూసుకొని బిర్యానీ తయారు చేయాలి.మీరు కూడా ఈ సూపర్ టేస్టీ ఇంకా ఈజీ Prawns బిర్యానీ రెసిపీ తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Miriyalu Kodi Vepudu Recipe in Telugu
Gongura Chicken Recipe in Telugu
Homemade Ulavacharu recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Hyderabadi Chicken Recipe in Telugu

Click here for the English version of this recipe.

5 from 1 vote
Prawns Biryani Telugu Recipe
Prep Time
40 mins
Cook Time
1 hr
Total Time
1 hr 40 mins
 
Course: Main Course
Cuisine: Hyderabadi, Indian
Servings: 4
Author: బిందు
Ingredients
మసాలా కొరకు
  • 1 tbsp షాజీరా
  • 1 tbsp సోంపు
  • 4 యాలుకలు
  • 5 లవంగాలు
  • 2 inch దాల్చినచెక్క
వేయించిన ఉల్లిపాయలు కొరకు
  • 2 పెద్ద ఉల్లిపాయలు
  • 1 tbsp నూనె వేయించడానికి సరిపడా
మారినేషన్ కొరకు
  • 300 గ్రాములు రొయ్యలు
  • 300 గ్రాములు పెరుగు
  • సాల్ట్ తగినంత
  • 2 tbsp కారం
  • 2 tsp బిర్యానీ మసాలా
  • వేయించిన ఉల్లిపాయలలో సగం
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 నిమ్మకాయ
  • ½ కప్ పుదినా ఆకులు
  • 375 గ్రాములు పెరుగు
అన్నం కోసం
  • 300 లేదా 350 గ్రాములు బాస్మతి రైస్
  • 2 tbsp గరం మసాలా దినుసులు
  • 2 బిరియాని ఆకు
  • 1 tbsp సాల్ట్
  • ¼ కప్ పుదీనా ఆకులు
  • 2 tbsp నూనె
బిర్యానీ కొరకు
  • 4-5 tbsp నూనె
  • ¼ కప్ పుదీనా ఆకులు
  • 1 tbsp వేయించిన ఉల్లిపాయలు మిగిలినవి
  • ¼ tsp కుంకుమ పువ్వు కలిపిన పాలు లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్
Instructions
మసాలా తయారీ విధానం
  1. ఒక చిన్న పెనంలో షాజీరా, సోంపు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క వేసి ఒక నిమిషం పాటు వేపి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు వేయించే విధానం
  1. ఒక కడాయి లో నూనె పోసి వేడి చేయాలి.
  2. సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కరకరలాడే వరకు వేయించాలి.
  3. నూనె లో నుండి బయటకి తీసేటప్పుడు గరిటెతో గట్టిగా నొక్కేస్తే నూనె అంతా కారిపోతుంది.కాసేపటికి ఉల్లిపాయలు కరకరలాడతాయి.
మారినేషన్ చేసే విధానం
  1. రొయ్యల్ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, బిర్యాని మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు సగం, సన్నని పచ్చిమిర్చి తరుగు, పుదీనా, నిమ్మ రసం మరియు పెరుగు వేసి బాగా కలిపి, ఒక అరగంట సేపు నాననివ్వాలి.
బియ్యం నానబెట్టుట
  1. రొయ్యల్ని మారినేట్ చేసిన వెంటనే బియ్యాన్ని కూడా నానబెట్టాలి.
  2. అరకేజీ బాస్మతి బియ్యం తీసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.

  3. తర్వాత బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి.
అన్నం వండుట కోసం
  1. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, అందులో సరిపడా ఉప్పు, గరం మసాలా దినుసులు, బిరియాని ఆకులు, నూనె, పుదీనా ఆకులు వేసి మరిగించాలి.
  2. నీరు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వెయ్యాలి.
  3. బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.
  4. అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించి, మరగడం మొదలైన దగ్గర నుండి 3-4 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
  5. కట్టేసిన వెంటనే నీరు వడకట్టేసి ఆ సగం ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి.
బిరియాని వండే విధానం
  1. ఒక మందపాటి అడుగు ఉన్న లోతైన గిన్నెలో, 4 నుండి 5 tbsp ల నూనె(ముందుగానే కాచినది) వేసి, నానబెట్టిన రొయ్యలు కుడా వేసి సమానంగా పరచుకునేలా సర్దాలి.
  2. తర్వాత దాని మీద సగం ఉడికిన అన్నం వేసి, పైన కొన్ని పుదినా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేం మీద, తర్వాత 7-10 నిమిషాలు సిమ్ మీద ఉడికించాలి.
  3. స్టౌ కట్టేసి వెంటనే మూత తెరవకుండా కాసేపు అలాగే ఉండనివ్వాలి.తర్వాత సర్వ్ చేయాలి.

Prawns Biryani Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=ect2JklTkbw[/embedyt]

 

Related Post

Please Share this post if you like