Site icon Maatamanti

Potato fry |ఆలూ ఫ్రై-సులువుగా బంగాళాదుంప వేపుడు చేయడం ఎలా?

potato fry

Potato fry recipe with step by step instructions.English Version.

ఈ కూర వండడం చాలా సులువు.కొత్తగా వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన వారు కుడా దీన్ని తేలికగా చేసేయవచ్చు.మిగతా కూరల్లో అయితే ఉల్లిపాయలు పూర్తిగా వేగాకే కురగాయల్ని వేస్తారు.కానీ ఈ కూర కోసం ఉల్లిపాయల్ని మరియు బంగాలదుంప ముక్కల్ని ఒక్కసారే వేసి, కాస్త ఉప్పు కూడా వేసి మూత పెట్టేస్తే సరిగ్గా 5 నుండి 7 నిమిషాలలో ముక్కలు మెత్తబడిపోతాయి.ముక్కలు సరిగ్గా ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఒక స్పూనుతో గానీ, కత్తితో గానీ ముక్కని గుచ్చినపుడు అది సులువుగా కిందకి దిగితే ఉడికినట్లే.ముక్కలు కాస్త ఉడకగానే పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి, అవి ముక్కలకు బాగా పట్టేవరకు ఉడికించాలి.స్టౌ కట్టేసే ముందు కొన్ని పుదినా ఆకులు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి కడాయి దించేసుకోవాలి.

ఈ కూరని అన్నంతో గానీ, చపాతిలతో గానీ వడ్డిస్తే బాగుంటుంది.మసాలా దోసె లో ఫిల్లింగ్ గా కూడా ఉపయోగపడుతుంది.అన్నం, పచ్చి పులుసు తో కలిపి ఈ కూరని కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.నేను డిగ్రీ చదువుతున్నపుడు నా ఫ్రెండ్ తార ఒకసారి వాళ్ళ ఇంటికి మధ్యాహ్న భోజనానికి రమ్మని ఆహ్వానించింది.ఆ రోజు వాళ్ల అమ్మగారు అన్నం, బంగాళాదుంప వేపుడు, పచ్చి పులుసు వడ్డించారు.ఆ కాంబినేషన్  నేను  తినడం అదే మొదటిసారి.ఎంతో రుచిగా అనిపించింది.తరవాత మా అమ్మకి చెప్తే తను కుడా ఈ కూర చేసిన ప్రతిసారి పచ్చిపులుసు కూడా చేసేవారు.నా పెళ్లయిన తర్వాత కూడా నేను అలానే చేస్తున్నాను.మా అమ్మాయి ఇది చాలా ఇష్టంగా తింటుంది.మీరు కూడా దీన్ని తయారు చేసి ఆ కమ్మని రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

you may also like

Cauliflower Pickle in Telugu
Saggubiyyam Punugulu Recipe in Telugu
How to prepare cake with Biscuits
Vegetable Cutlets Recipe in Telugu
Homemade Ulavacharu Recipe in Telugu
Thotakura Pesara Pappu Fry Recipe in Telugu
Chamagadda Fry Recipe in Telugu
Palak Paneer Recipe in Telugu

Click here for the English Version of this recipe

ఆలూ ఫ్రై
Prep Time
15 mins
Cook Time
20 mins
Total Time
35 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi
Author: బిందు
Ingredients
  • 500 గ్రాములు బంగాళాదుంపలు
  • 3 మీడియం ఉల్లిపాయలు సన్నగా నిలువుగా తరిగినవి
  • 4 పచ్చిమిరపకాయలు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 రెమ్మలు కరివేపాకు
  • 2 tsp కారం
  • ½ tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • ఉప్పు
  • 4-5 tsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర
  • ¼ కప్పు పుదీనా ఆకులు
Instructions
  1. కడాయి లో నూనె వేడి చేసి అందులో, నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బంగాళాదుంప ముక్కలు,ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.
  2. ఆలుగడ్డలు సగం ఉడికాక అందులో, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టి పూర్తిగా ఉడికేవరకు సన్నని సెగ మీద ఉడికించాలి.
  3. మధ్య మధ్యలో కూరని కలుపుతూ ఉండాలి.లేకపోతే కూర అడుగంటే ప్రమాదముంది.
  4. బంగాళాదుంప ముక్కలు పూర్తిగా ఉడికాక పుదినా ఆకులు, కొత్తిమీర వేసి మరొకసారి కలిపి స్టౌ ఆపేయాలి.

Potato Fry Video Recipe

Exit mobile version