Maatamanti

Palli Chutney Telugu Recipe-Andhra Hotel Style Palli chutney

Palli Chutney Telugu Recipe with step by step instructions.English Version.

పొద్దున్నే breakfast టైమ్ కి ఆకలి ఉన్నా లేకపోయినా, అసలు ఏమి తినాలని లేకపోయినా పల్లీ చట్నీ చూస్తే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొస్తుంది.పల్లీ చట్నీ దోశ, ఇడ్లీ, వడ లతో సూపర్ గా ఉంటుంది.ఉప్మా తో కూడా తింటారు.నేనయితే పచ్చడి కోసమే టిఫిన్ తింటాను.కాకపొతే తిన్నాక చాలా సేపు హెవీ గా అనిపిస్తుంది.నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి ఉండేది.తన పేరు రాజేశ్వరి.నాకన్నా 4 ఇయర్స్ చిన్నది.తనకి పల్లీ చట్నీ అంటే ఎంత పిచ్చి అంటే మైసూరు పాక్ తో కూడా నంజుకొని తినేది.

ఈ పల్లీ చట్నీ లో కొద్దిగా నువ్వులు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తో కలిపి చేసినా కూడా బాగుంటుంది.ఈ పచ్చడి లో చాలా పోషక విలువలుంటాయి.పిల్లలకి పొద్దున్నే breakfast లో పెడితే మంచిది.పిల్లలు కూడా మారం చేయ కుండా టిఫిన్ ఇష్టంగా తింటారు.ఈ రుచికరమైన పల్లీ చట్నీ ని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Tomato Pudina Chutney Recipe
Palli Karam Dosa Recipe in Telugu
Ulli Karam Dosa Recipe in Telugu
Pesarattu Recipe in Telugu
Instant Rava Vadalu Recipe in Telugu
Pudina Dahi Chutney Recipe in Telugu

Click Here for the English version of this Recipe.

మరిన్ని తెలుగు recipe videos కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Palli Chutney Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
5 mins
Total Time
20 mins
 
Course: Side Dish
Cuisine: Andhra, Hyderabadi, South Indian, Telangana
Author: BINDU
Ingredients
చట్నీ కొరకు
  • ½ కప్పు వేయించిన పల్లీలు
  • 6 నుండి 8 పచ్చిమిరపకాయలు
  • 4 వెల్లుల్లి రెబ్బలు
  • 1 tsp జీలకర్ర
  • తగినంత ఉప్పు
  • 3 tsp నూనె
తాలింపు కొరకు
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 1 ఎండుమిరపకాయ
  • ½ tsp పచ్చి శనగ పప్పు
  • ½ tsp మినపప్పు
  • 1 రెమ్మ కరివేపాకు
Instructions
వేయించుట
  1. ఒక పెనంలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి మగ్గే వరకు ఉడికించాలి.
  2. తర్వాత వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. స్టవ్ కట్టేసి కాసేపు చల్లారనివ్వాలి.
  4. తర్వాత మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు కూడా పోసి గ్రైండ్ చేయాలి.
తాలింపు
  1. పెనంలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం వేయించాలి.
  2. కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించి పల్లీ చట్నీ లో వేసి కలపాలి.

Palli Chutney Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=GNDPHmmHaFs[/embedyt]

 

Related Post

Please Share this post if you like