Maatamanti

Pachi Pulusu Telugu Recipe-పచ్చి పులుసు తయారీ

Pachi Pulusu Telugu Recipe with step by step instructions.English Versions.

అతి తక్కువ పదార్థాలతో తేలికగా కేవలం 15 నిమిషాలలో తయారు చేసుకోదగిన వంటకం ఈ పచ్చి పులుసు.వెనుకటి కాలంలో కడుపులో ఇబ్బంది అనిపించి నప్పుడు చింత పండు రసం తాగించే వారు.ఇలా చేయడం వల్ల మరుసటి రోజుకల్లా stomach అంతా ఇబ్బంది లేకుండా ఖాళీ అయిపోయి శుభ్ర పడుతుంది.కానీ కాల క్రమేణా ఇది పద్దతి మారిపోయి చింత పండు రసానికి బదులు పచ్చి పులుసు, చింత పండు చారు గా రూపాంతరం చెందాయి.ఒట్టి  చింత పండు రసం తాగమంటే ఎవరూ ఇష్టపడరు.అదే ఇలా పచ్చి పులుసు, చారు లాగా చేసి ఇస్తే చిన్న పిల్లలు కూడా మాట్లాడకుండా  లాగించేస్తారు.

నాకైతే పచ్చి పులుసు, బంగాళాదుంప వేపుడు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం.ఆ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది.ఈ పచ్చి పులుసు వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరుగా వేస్తారు.ఆంధ్రా వారు బెల్లం వేస్తారు.ఇది చింత పండు యొక్క పులుపు ను బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే.దాదాపు తెలంగాణా వారు బెల్లం లేదా పంచదార ఇందులో ఉపయోగించరు.కొన్ని చోట్ల ఎండు మిరపకాయలకు బదులు పచ్చి మిర్చి వేసి చేస్తారు.ఎలా చేసినా ఇది బాగానే ఉంటుంది.మీరు కూడా ఈ పచ్చి పులుసును తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Vegetable Sambar Recipe in Telugu
Dondakaya Vepudu Recipe in Telugu
Potato Fry Recipe in Telugu
Chamagadda Fry Recipe in Telugu
Fish Fry Recipe in Telugu
Thotakura Pesara Pappu Fry Recipe in Telugu

Click here for the English Version of this Recipe

Pachi pulusu Telugu Recipe
Prep Time
10 mins
Cook Time
3 mins
Total Time
13 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Author: బిందు
Ingredients
  • 25 గ్రాములు చింతపండు
  • 2 ఉల్లిపాయలు
  • 1 tsp జీలకర్ర
  • 3 ఎండుమిరపకాయలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • నిమ్మకాయ పరిమాణం బెల్లం
  • ఉప్పు తగినంత
  • 1 tbsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర
  • 500 ml నీళ్ళు
Instructions
చింతపండు రసం తయారీ
  1. 25 గ్రాముల చింతపండుని కొద్ది నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టాలి.
  2. ఒక పాత్ర పై జల్లెడ ఉంచి అందులో నుండి చింతపండు పులుసు పోయాలి.
  3. మళ్ళీ చింత పండు లో నీళ్ళు పోసి రసం తీసి జల్లెడ గుండా గిన్నెలోకి పోయాలి.
  4. ఇలా పిప్పి మిగిలే వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చింతపండు రసం తయారు చేయాలి.
తాళింపు
  1. ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
  2. నూనె కాగాక అందులో జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
పచ్చి పులుసు తయారీ
  1. ముందుగా తీసి పెట్టుకున్న చింత పండు రసంలో ఉప్పు, బెల్లం, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర వేయాలి.
  2. తయారు చేసి పెట్టుకున్న తాళింపు లోని నూనెని చింతపండు రసంలో వంపేసి, జీలకర్ర, ఎండు మిరపకాయ, కరివేపాకులను కచ్చాపచ్చా గా నూరి పచ్చి పులుసు లో వేసి బాగా కలపాలి.

Pachi Pulusu Telugu Recipe Video

Related Post

Please Share this post if you like