Site icon Maatamanti

Mutton Biryani Telugu Recipe-మటన్ బిర్యానీ తయారీ

mutton biryani telugu recipe

Mutton Biryani Telugu Recipe with step by step instructions.English Version.

నేను మొట్టమొదటి సారి నేర్చుకుని  చేసిన బిర్యానీ మటన్ బిర్యానినే.ఈ వంటకాన్ని నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను.మా అత్తగారికి ఇంతకుముందు వారి ఇంటి పక్కన ఉండే ముస్లిమ్ వారు నేర్పించారట.నేను నేర్చుకోక ముందు బయట హోటల్ లో తినడమే కానీ ఎప్పుడూ చేయలేదు.మా అమ్మ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారవడం వల్ల తనకి బిర్యానీ వండే విధానం తెలీదు.ఎప్పుడు పలావు మాత్రమే చేసేవారు.మొదటిసారి ఈ బిర్యానీ ని మా అత్తగారు చేస్తుంటే చూశాను.తర్వాత నేను స్వయానా ట్రై చేసాను.అస్సలు కుదరలేదు.తర్వాత రెండు సార్లు కూడా అలానే అయింది.తర్వాత ఎలా అయినా నేర్చుకోవాల్సిన్దేనని పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను.అతి తక్కువ క్వాంటిటీ తో చికెన్ బిర్యానీ చేశాను.అప్పుడు కుదిరింది.నేను నేర్పిస్తే నాకన్నా బాగా చేస్తున్నావని మా అత్తగారు నన్ను మెచ్చుకున్నారు.

ఫస్ట్ టైం బిర్యానీ చేయాలనుకునేవారు మటన్ తో కన్నా చికెన్ తో చేయడమే మంచిది.ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు.అందుకే ఎంత సేపు వండాలో అర్ధం కాక కాస్త తికమక పడే అవకాశం ఉంది.మటన్ చక్కగా ఉడకాలంటే కనీసం 4 నుండి 5 గంటలు పెరుగు, మసాలాలు పట్టించి నానబెట్టాలి.లేదా ముందు రోజు రాత్రే కలిపేసి ఫ్రిజ్ లో పెట్టుకుని వండాలనుకునే 30 నిమిషాల ముందు బయటకు తీసి బిర్యానీ వండుకోవచ్చు.ఈ బిర్యానీ ని దాల్చా తో గానీ, మిర్చి కా సాలన్ తో గానీ, రైతా తో గానీ వడ్డిస్తే రుచిగా ఉంటుంది.ఈ మటన్ బిర్యానీ రెసిపీ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

Chicken Tikka Pulao Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Hyderabadi Prawns Biryani Recipe in Telugu
Natu Kodi Pulusu Recipe in Telugu
Pressure Cooker Chicken Biryani Recipe in Telugu
Bamboo Chicken Biryani Recipe in Telugu
Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Prawns Pulao Recipe in Telugu
Royyala Biryani Recipe in Telugu

Click Here for the English Version of this Recipe.

Mutton Biryani Telugu Recipe
Prep Time
4 hrs
Cook Time
1 hr
Total Time
5 hrs
 
Course: Main Course
Cuisine: Hyderabadi, Indian
Servings: 3
Author: బిందు
Ingredients
బిర్యానీ మసాలా కొరకు
  • 1 tbsp షాజీరా
  • 1 tbsp సోంపు
  • 4 యాలకులు
  • 6 లవంగాలు
  • 2 అంగుళాల దాల్చినచెక్క
వేయించిన ఉల్లిపాయల కొరకు
  • 3 మీడియం ఉల్లిపాయలు
  • 100 ml నూనె , డీప్ ఫ్రై కొరకు
మారినేషన్ కొరకు
  • 500 గ్రాములు మటన్
  • 300 గ్రాములు పెరుగు
  • ఉప్పు తగినంత
  • 1 tsp పసుపు
  • 3 tsp కారం
  • 2 tsp బిర్యానీ మసాలా , పై దినుసులతో చేసినది
  • 1 ½ tsp అల్లంవెల్లుల్లి ముద్ద
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 2 tsp పచ్చిమిర్చి తరుగు
  • ముందుగా వేయించిన ఉల్లిపాయలలో సగం
  • 1 నిమ్మకాయ
అన్నం వండుట కోసం
  • 750 గ్రాములు బియ్యం
  • 3 లీటర్లు నీళ్ళు , బియ్యాన్ని ఉడికించడానికి
  • ఉప్పు తగినంత
  • గరం మసాలా దినుసులు అన్ని , నీళ్ళలో వేయడానికి
  • 1 tbsp నూనె
బిర్యానీ కొరకు
  • 4 లేదా 5 tbsp కాచిన నూనె
  • 2 tbsp నెయ్యి
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • వేయించిన ఉల్లిపాయలు మిగతా సగం
Instructions
మసాలా తయారీ విధానం
  1. ఒక చిన్న పెనంలో షాజీరా, సోంపు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క వేసి ఒక నిమిషం పాటు వేపి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు వేయించే విధానం
  1. ఒక కడాయి లో నూనె పోసి వేడి చేయాలి.
  2. సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కరకరలాడే వరకు వేయించాలి.
  3. నూనె లో నుండి బయటకి తీసేటప్పుడు గరిటెతో గట్టిగా నొక్కేస్తే నూనె అంతా కారిపోతుంది.కాసేపటికి ఉల్లిపాయలు కరకరలాడతాయి.
మారినేషన్ చేసే విధానం
  1. మటన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, 1 tbsp బిర్యాని మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు సగం, సన్నని పచ్చిమిర్చి తరుగు, పుదీనా, నిమ్మ రసం మరియు పెరుగు వేసి బాగా కలిపి, 4 గంటలు నాననివ్వాలి.
బియ్యం నానబెట్టుట
  1. నాలుగు గంటలలో 3 ½ గంటలు అవ్వగానే బియ్యం నానబెట్టాలి.
  2. అరకేజీ బాసుమతి బియ్యం తీసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  3. తర్వాత బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి.
అన్నం వండుట కోసం
  1. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, అందులో సరిపడా ఉప్పు, గరం మసాలా దినుసులు, బిరియాని ఆకులు, నూనె, పుదీనా ఆకులు వేసి మరిగించాలి.
  2. నీరు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వెయ్యాలి.
  3. బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.
  4. అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించి, మరగడం మొదలైన దగ్గర నుండి 3-4 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
  5. కట్టేసిన వెంటనే నీరు వడకట్టేసి ఆ సగం ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి.
బిరియాని వండే విధానం
  1. ఒక మందపాటి అడుగు ఉన్న లోతైన గిన్నెలో, 4 నుండి 5 tbsp ల నూనె(ముందుగానే కాచినది) వేసి, 2 tbsp ల నెయ్యి నానబెట్టిన మటన్ కూడా వేసి సమానంగా పరచుకునేలా సర్దాలి.
  2. తర్వాత దాని మీద సగం ఉడికిన అన్నం వేసి, పైన కొన్ని పుదినా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి, గిన్నెను అల్యూమినియం ఫాయిల్ తో సరిగ్గా కవర్ చేసి మూత పెట్టి 10-15 నిమిషాలు హై ఫ్లేం మీద, తర్వాత 15 నిమిషాలు సిమ్ లో సన్నని సెగ మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.
  3. ఒక అరగంట ఆగి తరవాత వడ్డించాలి.

Mutton Biryani Telugu Recipe Video

 

Exit mobile version