Maatamanti

Mushroom Pulao Telugu Recipe-మష్రూమ్ పులావ్ తయారీ

Mushroom Pulao Telugu recipe with step by step instructions.English Version.

నేను ఫుడ్ బ్లాగ్గింగ్ మొదలు పెట్టక ముందు నా ఆలోచనా విధానం వేరుగా ఉండేది. “నాన్ వెజ్ తినేవాళ్ళకు ఆదివారం వస్తే వంద ఆప్షన్లు ఉంటాయి తినడానికి.మరి వెజిటేరియన్ లకు ఏముంటాయి. వారం రోజులు అదే, వారం చివర కూడా అదే.కూరగాయలు తినీ తినీ బోర్ కొట్టదా” అని అనుకునేదాన్ని. అసలు నేనెప్పుడు ఆదివారం రోజు శాకాహారం వండేదాన్ని కాదు.

కానీ ఎప్పుడైతే బ్లాగ్గింగ్ మొదలు పెట్టానో అప్పుడు  కేవలం నా కోసమే కాకుండా నా సైట్ ను విజిట్ చేసేవారికి కూడా అనువుగా ఉండే వంటకాలు చేయవలసి రావడంతో అప్పటి నుండి వెజ్ వంటకాల మీద కూడా కాస్త దృష్టి పెట్టాను. ఆదివారం స్పెషల్ గా చేసుకోవడానికి వెజిటేరియన్ లో కూడా చాలా వంటకాలు ఉన్నాయని గుర్తించాను.

మీల్ మేకర్ తో పులావు, గుత్తి వంకాయలతో దమ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, పుట్ట గొడుగుల పులావు, పనీర్ పులావు, కొత్తిమీర పులావు, క్యాలిఫ్లవర్ పులావు, బీట్ రూట్ పులావు  వంటి వంటకాలు కొన్ని చేశాను. అవి అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఈ పుట్ట గొడుగుల పులావు విషయానికొస్తే రుచి మాత్రం అదిరిపోతుంది. కావాలంటే మీరు దీంట్లోనే పనీర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు.అలా కూడా బాగుంటుంది. లేదంటే క్యారెట్, బంగాళాదుంప, పచ్చి బఠానీలు, క్యాలిఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్ వంటి కూరగాయలతో కూడా కలిపి మష్రూమ్ పులావు చేసుకోవచ్చు.

ఈ రెసిపీ లో పులావ్ మసాలా వేయాలి కదా దాని కొరకు నేను మీకు పులావు మసాలా రెసిపీ ని కూడా ఇంతకు ముందు పోస్ట్ చేసాను.దాని లింక్ ను ఇక్కడ ఇస్తున్నాను. పులావు మసాలా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు పులావు మసాలా రెసిపీ చూడవచ్చు. నేను చెప్పిన విధానం లోనే తయారు చేసి ఆ మసాలా ను మీరు ఈ పుట్ట గొడుగుల పలావు లో వేసి చేస్తే చాలా బాగా వస్తుంది.

ఈ పుట్ట గొడుగుల పలావ్ ని కుర్మా తో ఇంకా రైతా తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అసలు ఉత్తిగా తిన్నా కూడా సూపర్ టేస్టీ గా ఉంటుంది. school లో లంచ్ తినకుండా మారం చేసే పిల్లలకు ఇది లంచ్ బాక్స్ లో పెట్టిస్తే శుభ్రంగా బాక్స్ ఖాళీ చేస్తారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. సో మీరు కూడా ఈ రెసిపీ ని తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Gutti Vankaya Biryani Recipe in Telugu
Beetroot Pulao Recipe in Telugu
Cauliflower Pulao Recipe in Telugu
Schezwan Fried Rice in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Prawns Pulao Recipe in Telugu

Click here for the English Version of this recipe.

Mushroom Pulao Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
40 mins
Total Time
1 hr 10 mins
 
Course: Main Course
Cuisine: Hyderabadi, Indian
Author: బిందు
Ingredients
  • 250 గ్రాములు బాస్మతి బియ్యం
  • 200 గ్రాములు పుట్ట గొడుగులు
  • tbsp నెయ్యి
  • tbsp నూనె
  • 1 మీడియం ఉల్లిపాయ
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1 మీడియం టమాటో
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 ½ tsp పులావు మసాల
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • ¼ కప్పు కొత్తిమీర
  • ¼ కప్పు పెరుగు
  • 1 అనాస పువ్వు
  • 4 ఏలకులు
  • 1 జాపత్రి
  • ½ అంగుళం దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • 1 బిర్యానీ ఆకు
  • కప్పులు నీళ్ళు( బియ్యం కొలవడానికి వాడిన కప్పు తోనే)
  • ఉప్పు తగినంత
Instructions
  1. బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  2. ఈ లోపు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరగాలి.పచ్చిమిరపకాయలు ఇంకా పుట్ట గొడుగుల్ని కూడా కడగాలి.
  3. అరగంట తర్వాత బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడగి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక గిన్నెలో 2 tbsp ల నెయ్యి ఇంకా నూనె వేసి వేడి చేయాలి.
  5. నూనె కాగినాక అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, జీడి పప్పు వేసి దోరగా వేయించాలి.
  6. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించాలి.
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  8. పలావ్ మసాలా, పెరుగు, తరిగిన పుట్ట గొడుగులు వేసి కలిపి ౩ నుండి 5 నిమిషాలు వేయించాలి.
  9. తగినన్ని నీళ్ళు పోసి ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి.
  10. 1 tbsp నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసి నీళ్ళు మరిగే వరకు ఆగాలి.
  11. నీళ్ళు మరగడం మొదలవగానే అందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.
  12. బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతుంది. అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించాలి.
  13. అన్నం ఉడకడం మొదలవగానే ఫ్లేమ్ ను సిమ్ లో ఉంచి అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.

Mushroom Pulao Telugu Recipe Video

 

Related Post

Please Share this post if you like