Site icon Maatamanti

Mushroom Pickle Telugu Recipe-పుట్టగొడుగుల పచ్చడి

mushroom pickle telugu recipe

Mushroom Pickle Telugu Recipe with step by step instructions.English Version.

అతి తక్కువ సమయంలో చేయగలిగిన రుచికరమైన పచ్చడి ఈ mushroom pickle.నేను ఈ pickle ను అచ్చు చికెన్ పచ్చడి చేసే విధానంలోనే చేసాను.నిమ్మకాయ రసం పిండడం వల్ల ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు.2 నుండి 3 రోజుల లోపు వాడేయాలి.

ఒకవేళ నిలవ పచ్చడి పెట్టాలనుకుంటే నిమ్మరసానికి బదులు చింతపండు వేయాలి.200 గ్రాముల పుట్టగొడుగు లకు 50 గ్రాముల చింతపండు వాడాలి.చింతపండులోని పీచు లాంటివి తీసేయాలి.ఒకసారి మంచి నీళ్ళలో కడగాలి.చింతపండులో ఒక కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద ఉంచి మెత్తబడేవరకు ఉడికించాలి.తర్వాత స్టవ్ కట్టేసి ఆరనివ్వాలి.ఆరాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.పచ్చడిని కింద చెప్పిన విధంగానే తయారు చేసి నిమ్మరసం బదులు చింతపండు పేస్ట్ వేసి బాగా కలపాలి.చింతపండుతో చేస్తే నూనె కూడా కొంచెం ఎక్కువ వేయాలి.100 నుండి 150 ml నూనె సరిపోతుంది.

ఈ పచ్చడి తయారీకి బటన్ mushrooms, milky mushrooms లేదా మీకు అందుబాటులో ఉన్న ఏ రకం పుట్టగొడుగులనైనా ఉపయోగించవచ్చు.ఈ పచ్చడి అన్నం తో గానీ, రోటీలతో గానీ పుల్కాలతో గానీ తినవచ్చు.నోరూరించే ఈ రుచికరమైన పచ్చడిని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Pandumirapakaya nilava pachadi Recipe in Telugu
Andhra Avakaya Pachadi Recipe in Telugu
Cauliflower Pickle Recipe in Telugu
Tomato Pudina Chutney Recipe in Telugu
Nellore Chepala Pulusu Recipe in Telugu
Masala Vadalu Recipe in Telugu

ఈ recipe తెలుగు వెర్షన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Mushroom Pickle Recipe
Prep Time
10 mins
Cook Time
15 mins
Total Time
25 mins
 
Course: Side Dish
Cuisine: Andhra, Hyderabadi, Indian
Servings: 20
Author: బిందు
Ingredients
  • 200 గ్రాములు మిల్కీ/బటన్/ఆయిస్టర్ మష్రూమ్స్
  • 75 గ్రాములు నూనె
  • ఉప్పు తగినంత
  • ¼ tsp పసుపు
  • 20 గ్రాములు కారం
  • 4 లేదా 5 మెంతులు
  • 1 tsp ఆవాలు
  • 2 tbsp నిమ్మరసం
  • 1 tsp అల్లంవెల్లుల్లి పేస్ట్
Instructions
మష్రూమ్స్ ను శుభ్రపరచుట
  1. ఈ పచ్చడి కొరకు మీరు మిల్కీ మష్రూమ్స్ కానీ, బటన్ మష్రూమ్స్ కానీ లేదా ఆయిస్టర్ మష్రూమ్స్ కానీ వాడవచ్చు.
  2. పుట్టగొడుగుల మీద కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడగాలి.
  3. తర్వాత ఒక పేపర్ నాప్‌కిన్ తో గానీ పొడి బట్టతో గానీ తడి లేకుండా తుడవాలి.
  4. పుట్టగొడుగులను ఒక మాదిరి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆవాల పొడి తయారు చేయుట
  1. ఒక చిన్న పెనంలో మెంతులు, ఆవాలు వేసి సన్నని సెగ మీద వేయించాలి.
  2. ఆవాలు చిటపటలాడం మొదలు పెట్టగానే స్టవ్ ఆపు చేసి వాటిని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
పచ్చడి తయారీ విధానం
  1. పెనంలో నూనె వేడి చేసి, అందులో పుట్టగొడుగు ముక్కలు వేసి చక్కని బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
  2. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి స్టవ్ కట్టేయాలి.
  3. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆవాలు మెంతుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
  4. 5 నుండి 6 గంటలు ఊరనిచ్చి తర్వాత సర్వ్ చేయాలి.

Mushroom Pickle Telugu Recipe Video

Exit mobile version