Maatamanti

Mulakkada Royyala Curry – Prawns and Drumstick Curry

Mulakkada Royyala Curry With step by step instructions.English Version.

నా YOUTUBE subscriber ఒకరు కోరగా నేను ఈ recipe ని పోస్ట్ చేశాను.అంతకు ముందు నేనెప్పుడూ ఈ కాంబినేషన్ ట్రై చేయలేదు.కానీ తను అడిగిన వెంటనే నాకు ట్రై చేయాలనిపించింది.తయారు చేశాను.చాలా బాగా కుదిరింది.అది కూడా మట్టి పాత్రలో చేయడం వల్ల ఇంకా టేస్టీ గా అనిపించింది.

నేను ఎప్పుడూ ములక్కాడ మటన్, ములక్కాడ చేపల కూర, ములక్కాడ కోడిగుడ్డు కూర లాంటివి చేస్తుంటాను.ఇక ఇప్పటి నుండి prawns ములక్కాడ కూర కూడా చేస్తాను.బాగా నచ్చింది కదా.ఈ కూర కోసం నేను మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను.కానీ మీరు చిన్న రొయ్యలు లేదా పెద్ద రొయ్యల తో కూడా చేయవచ్చు.ఒకవేళ ఫ్రోజెన్ prawns వాడుతున్నట్లయితే సరిగ్గా defrost చేశాక మాత్రమే వండాలి.లేకపోతే కూరలో వేయగానే అవి గట్టిగా అయిపోతాయి.

మరీ లేత ములక్కాడలు లేదా మరీ ముదురు కాడలు కాకుండా కాస్త కండ ఉన్న కాడలు వాడితే బాగుంటుంది.ములక్కాడలను కూరలో వేశాక జాగ్రత్తగా కలపాలి.లేకపోతే మునక్కాడలు పుల్లలు పుల్లలుగా విడిపోయి కూర తినడానికి ఇబ్బందిగా ఉంటుంది.మీరు ఈ కూరలో నీళ్ళకి బదులు కొబ్బరి పాలు కూడా వేసి తయారు చేయ వచ్చు.ఈ కూర వేడి వేడి అన్నం తో తింటే చాలా బాగుంటుంది.మీరు కూడా ఈ recipe ని తప్పక  ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Bongulo Chicken Biryani Recipe in Telugu
Pandumirchi Chicken Fry Recipe in Telugu
Kothimeera Kodi Pulao Recipe in Telugu
Pressure Cooker Chicken Recipe in Telugu
Mutton Dalcha Recipe in Telugu
Nellore Chepala Pulusu Recipe in Telugu

Click here for the English Version of the Recipe.

Mulakkada Royyala Curry
Prep Time
15 mins
Cook Time
25 mins
Total Time
40 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Author: బిందు
Ingredients
  • 300 గ్రాములు రొయ్యలు
  • 2 నుండి 3 ములక్కాడలు
  • 2 మీడియం ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిరపకాయలు
  • 2 మీడియం టమాటాలు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 1 ½ లేదా 2 tbsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • 5 లేదా 6 tbsp నూనె
  • 1 రెమ్మ కరివేపాకు
  • 2 రెమ్మలు పుదీనా
  • ¼ కప్పు కొత్తిమీర
  • 1 లేదా 250 ml నీళ్ళు
Instructions
  1. రొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి తరుగు, ములక్కాడ ముక్కలు, ఉప్పు వేయాలి.
  3. బాగా కలిపి ఉల్లిపాయ తరుగు మెత్తబడే వరకు లేదా ములక్కాడలు ఆలివ్ గ్రీన్ కలర్ లోకి మారే వరకు వేయించాలి.
  4. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  6. పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఒక సారి కలపాలి.
  7. రొయ్యలు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
  8. తర్వాత 1 కప్పు నీళ్ళు పోసి, కూరని కలిపి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
  9. మూత తెరిచి గరం మసాలా వేసి కూర కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించాలి.
  10. కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.

Mulakkada Royyala Curry Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=B8N9Yp2xDWY[/embedyt]

 

Related Post

Please Share this post if you like