Site icon Maatamanti

Millet Payasam Telugu Recipe- అరికెల తో పాయసం

Millets Payasam Telugu Recipe

Millet Payasam Telugu Recipe with step by step instructions.English Version.

కీటో డైట్ చేయడం ఆపేశాక మిల్లెట్స్ ఉపయోగించడం మొదలు పెట్టాను. తెల్ల అన్నం బదులుగా బ్రౌన్ రైస్ లేదా చిరు ధాన్యాలతో చేసిన అన్నం తినడం మొదలుపెట్టాము మా ఇంట్లో. తెల్ల బియ్యం తో పోల్చినప్పుడు చిరు ధాన్యాలలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక్కో రకం చిరు ధాన్యాలలో ఒక్కో రకం పోషక పదార్ధాలు ఉంటాయి వాటికి తగ్గట్లు గానే ఆరోగ్య లాభాలు ఉంటాయి. బరువు కూడా పెరగకుండా మైంటైన్ చేసుకోవచ్చు.

నేను ఈ మిల్లెట్ పాయసాన్ని కొర్రలతో చేశాను. మీరు కావాలంటే అరికెలతో గానీ, సామలతో గానీ, ఊదలతో గానీ చేసుకోవచ్చు. మీకు పాయసం చేసుకోవాలనిపించినపుడల్లా  బియ్యం, సేమియా, సగ్గుబియ్యం లాంటి వాటితో కాకుండా ఇలా చిరు ధాన్యాలు ఉపయోగించి చేసుకుంటే మంచిది. మిల్లెట్స్ తో చేసి మళ్ళీ పంచదార వేసి చేయడం సరి కాదు. అందుకే మామూలు బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, కోకోనట్ షుగర్ కానీ ఉపయోగించి చేసుకోవచ్చు.

ప్రస్తుతం చిరు ధాన్యాలు ఆర్గానిక్ వి అయితే 500 గ్రాములు 60 నుండి 80 రూపాయల ధర ఉంటున్నాయి. అంటే కిలో ధర 120 నుండి 160 రూపాయలన్న మాట. ముందు ముందు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి పెరిగితే ధరలు ఏమైనా తగ్గవచ్చునెమో. మాకయితే రోజుకి 1/2 కప్పు మిల్లెట్స్ సరిపోతున్నాయి. వాటితో చేసిన అన్నం తింటే కొద్దిగా తినగానే కడుపు నిండుగా అనిపించి సరిపోతుంది. ఈ మధ్య అందరూ మెల్ల మెల్లగా ఈ చిరు ధాన్యాలకు అలవాటు పడుతున్నారు. మంచి మార్పే. ఈ మార్పు ఇలానే ఉండాలని కోరుకుంటూ నా ఈ రెసిపీ ని మీరు తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. క్రింద ఈ రెసిపీ కి సంబంధించిన వీడియో లింక్ కూడా పెట్టాను అవసరమైతే చూడండి.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Bombay Rava Cake Recipe in Telugu
Mango Ice Cream Recipe in Telugu
Malai Laddu Recipe in Telugu
Ariselu Sweet Recipe in Telugu
Dry Fruit Bobbatlu Recipe in Telugu
Dry Fruit Laddu Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Flax Seeds Laddu Recipe in Telugu

Click here for the English Version of this Recipe.

5 from 1 vote
Millets Payasam Telugu Recipe
Millet Payasam Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
30 mins
Total Time
1 hr
 
Course: Dessert
Cuisine: Andhra, South Indian, Telangana
Servings: 3
Author: బిందు
Ingredients
  • 1/2 కప్పు లేదా 100 గ్రాములు కొర్రలు
  • 1/2 కప్పు లేదా 80 గ్రాములు బెల్లం
  • 2 1/2 కప్పులు నీళ్లు కొర్రలు వండుట కొరకు
  • 1/2 కప్పు నీళ్లు బెల్లం పాకం కొరకు
  • 1/2 కప్పు కాచిన పాలు
  • 4 లేదా 5 ఏలకులు
  • 1 tbsp నెయ్యి
  • 6 జీడిపప్పులు
  • 6 బాదం పప్పులు
  • 5 పిస్తా పప్పులు
  • 15 ఎండు ద్రాక్షలు
Instructions
  1. కొర్రల్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి అందులో 2 1/2 కప్పులు నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి.
  2. ఈ లోపు ఒక మందపాటి పాత్రలో బెల్లం వేసి అందులో 1/2 కప్పు నీళ్లు పోసి హై ఫ్లేమ్ లో పొయ్యి మీద పెట్టాలి.
  3. బెల్లం నీళ్లు కరగడం మొదలవగానే స్టవ్ సిమ్ లోకి తిప్పి, కొద్దిగా క్రష్ చేసిన ఏలకులు వేసి మరిగించాలి.
  4. తీగ పాకం పట్టనవసరం లేదు. వేళ్ళతో పట్టుకుంటే నూనె లా జిడ్డుగా అనిపించేంత వరకు మరిగిస్తే చాలు.

  5. బెల్లం పాకం తయారు చేయడం అయిపోయాక స్టవ్ కట్టేసి పక్కన పెట్టాలి.
  6. కొర్రల్ని హై ఫ్లేమ్ మీద ఉంచి ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
  7. ఉడకడం మొదలవగానే స్టవ్ సిమ్ లో ఉంచి చక్కగా నీరంతా ఇగిరే వరకు వండాలి.
  8. నీళ్లంతా ఇగిరిపోయి కొర్రలు ఉడికాక అందులో కాచిన పాలు పోసి, కొర్రలు ఆ పాలని పీల్చుకునే వరకు ఉడికించాలి.
  9. తర్వాత పొయ్యి కట్టేసి ఒక 5 నిమిషాలు కొర్ర అన్నాన్ని ఆరనివ్వాలి.
  10. ఈ లోపు చిన్న పెనంలో నెయ్యి కరిగించి, అందులో జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

  11. తర్వాత ఒక జల్లెడ గుండా బెల్లం పాకాన్ని ఉడికిన కొర్రలలో వేసి బాగా కలపాలి.
  12. వేయించిన పప్పు లను పాయసం లో వేసి వేడిగా సర్వ్  చేయాలి.

Millet Payasam Telugu Recipe Video

Exit mobile version