Site icon Maatamanti

Malai Paneer Tikka Telugu Recipe-మలై పనీర్ టిక్కా

malai paneer tikka telugu recipe

Malai Paneer Tikka Telugu Recipe with step by step instructions.English version.

ఇది మాత్రం కచ్చితంగా ట్రై చేయాల్సిన వంటకం.ఇదే డిష్ ని రెస్టారెంట్ కెళ్ళి ఆర్డర్ చేస్తే నాలుగే నాలుగు పనీర్ ముక్కలు పెట్టి 300 రూపాయలకు పైన బిల్లు వేస్తారు.టేస్ట్ బాగున్నా మళ్ళీ ఆర్డర్ చేయము.ఎందుకంటే మనకు ఏదైనా క్వాంటిటీ ఎక్కువ కనపడితే కానీ కంటికి ఆనదు కదా.అందుకే ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకోవడమే బెటర్.

సరే ఇక ఈ recipe విషయానికొస్తే ముందుగా మనం పనీర్ ను సిద్దం చేసుకోవాలి.దాదాపు మనం పనీర్ ను బయట సూపర్ మార్కెట్ లో కొంటాము.అది ఫ్రిజ్ లో ఉంచడం వల్ల సంకోచం చెంది ఉంటుంది అంతే కాకుండా గట్టిగా కూడా అవుతుంది.అప్పుడు మసాలా లాంటివి పట్టించినా అది గ్రహించదు.అందుకని మారినేట్ చేసే ముందుగా కాసేపు వేడి నీళ్ళలో నానబెడితే పనీర్ మృదువుగా మారుతుంది.పట్టించిన మసాలాలను కూడా బాగా గ్రహిస్తుంది.అప్పుడు పనీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది.దీనిని గ్రీన్ చట్నీ తో ఇంకా వెజిటెబుల్ సలాడ్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.ఇదే పద్ధతిలో చికెన్ tigh పీసెస్ తో చేసినా కూడా చాలా బాగుంటుంది.ఈ రుచికరమైన పనీర్ టిక్కా recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Veg Manchurian Recipe in Telugu
Chinese Egg Noodles Recipe in Telugu
Garlic Paneer Recipe in Telugu
Chicken Shawarma Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Masala Vada Recipe in Telugu

Click here for the English Version of the Recipe.

Malai Paneer Tikka Telugu Recipe
Prep Time
1 hr
Cook Time
15 mins
Total Time
1 hr 15 mins
 
Course: Appetizer, Starter
Cuisine: Indian
Servings: 2
Author: బిందు
Ingredients
  • 250 గ్రాములు పనీర్
  • 500 ml వేడి నీళ్ళు
  • తగినంత ఉప్పు
  • 1 tsp సోంపు
  • 3 ఏలకులు
  • ½ లేదా 1 tsp చాట్ మసాలా
  • ¼ tsp నల్ల ఉప్పు
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ½ tsp జీలకర్ర పొడి
  • ½ tsp పంచదార
  • 2 tbsp జీడిపప్పు పొడి
  • చిటికెడు ఎర్ర ఫుడ్ కలర్
  • ½ నిమ్మ చెక్క
  • ½ కప్పు గడ్డ పెరుగు
  • 4 tsp నూనె
Instructions
పనీర్ ను నానబెట్టుట
  1. పనీర్ ను చక్కని క్యూబ్స్ గా కట్ చేయాలి.
  2. వేడి నీళ్ళలో తగినంత ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
గ్రైండ్ చేయుట
  1. ఈ లోపు సోంపు మరియు ఏలకులను దోరగా వేయించి పొడి కొట్టి పక్కన ఉంచుకోవాలి.

మారినేట్ చేయుట
  1. ఒక మిక్సింగ్ బౌల్ లో గడ్డ పెరుగు వేసి బాగా గిలకొట్టాలి.
  2. అందులో నల్ల ఉప్పు, చాట్ మసాలా, సోంపు & ఏలకుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీడిపప్పు పొడి, కారం, జీలకర్ర పొడి, ఎర్ర ఫుడ్ కలర్, నిమ్మ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పంచదార వేసి బాగా కలపాలి.
  3. తర్వాత పనీర్ కూడా వేసి మళ్ళీ కలపాలి.ఆ తర్వాత 30 నిమిషాల నుండి 1 గంట పాటు పక్కన ఉంచాలి.
వేయించుట
  1. ఒక పెనంలో నూనె వేసి కాగాక అందులో నానబెట్టి ఉంచిన పనీర్ ను వేయాలి.
  2. మీడియం సెగ మీద నూనె బయటకు ఊరే వరకు గానీ లేదా మసాలా డ్రై గా అయ్యేవరకు గానీ వేయించి స్టవ్ కట్టేయాలి.

Malai Paneer Tikka Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=W23FXBxG-Kc[/embedyt]

 

Exit mobile version