Maatamanti

Hotel Style Poori Curry Telugu Recipe

Hotel Style Poori Curry Telugu Recipe with step by step instructions.English Version.

ఈ హోటల్ పూరి కర్రీ నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు.ఈ కూరలో ఉల్లిపాయలు మరియు శనగపిండి ప్రధాన పదార్ధాలు.ఒక్కోసారి ఆటి రావడానికి కానీ లేదా ఎక్స్ట్రా రుచి కి గానీ ఉడకబెట్టిన బంగాళాదుంపలను కూడా ఉపయోగిస్తారు.కానీ ఈ కూర ఎక్కువ సేపు నిల్వ ఉండదు.వెంటనే రెండు మూడు గంటలలో వాడేయాలి.లేకపోతే కూర పాడయిపోయి వెంటనే వాసన వచ్చేస్తుంది.

ఈ కూర పూరితో బాగుంటుంది.శనగ పిండి వేయాలి కదా అని ఎంత పడితే అంత వేయకూడదు.కొద్దిగా వేస్తే సరిపోతుంది.శనగ పిండి పచ్చి వాసన పోయే వరకు సిమ్ లో ఉడికించాలి.కూర చిక్కబడ్డాక స్టవ్ కట్టేసి వేడి వేడి గా వడ్డించాలి.ఈ తేలికైన మరియు రుచికరమైన వంటను మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Palli Chutney Recipe in Telugu
White Sauce Pasta Recipe in Telugu
Sprouted Moong Dal Pesarattu Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Leftover Bread Pancake Recipe
Chinese Egg Noodles Recipe in Telugu

Click Here for the English Text Version of this Recipe

Hotel Poori Curry Telugu Recipe
Prep Time
10 mins
Cook Time
20 mins
Total Time
30 mins
 
Course: Breakfast
Cuisine: Andhra, Hyderabadi, Indian, Telangana
Author: బిందు
Ingredients
  • 1 మీడియం బంగాళాదుంప ఉడకబెట్టినది
  • 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగినది
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 tbsp అల్లం తరుగు
  • 2 tbsp శనగపిండి
  • 1 ½ కప్పులు నీళ్ళు
  • 1 tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • ½ tsp పచ్చిశనగ పప్పు
  • 1 ఎండు మిరపకాయ
  • 3 tbsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర
  • ½ tsp పసుపు
  • ఉప్పు తగినంత
  • 4 tsp నూనె
Instructions
  1. ఒక బంగాళాదుంప ను శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలి.
  2. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ¼ కప్పు నీళ్ళలో శనగపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక పెనంలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగ పప్పు, ఎండు మిరపకాయ వేసి చిటపట లాడే వరకు వేయించాలి.
  5. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  6. ఉప్పు, పసుపు, అల్లం తరుగు, కరివేపాకు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలపాలి.
  7. కూరలో నీళ్ళు పోసి బాగా కలిపి కూర మెత్తబడే వరకు వేయించాలి.
  8. తర్వాత శనగపిండి నీళ్ళు పోసి కూర చిక్క బడే వరకు ఉడికించాలి.
  9. కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేసి వేడిగా పూరీలతో సర్వ్ చేయాలి.

 

Hotel Style Poori Curry Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=Apw2Kw9oVuU[/embedyt]

 

Related Post

Please Share this post if you like