Site icon Maatamanti

Gongura Egg Curry Telugu Recipe-గోంగూర కోడిగుడ్డు కూర

gongura egg curry telugu recipe

Gongura Egg Curry Telugu Recipe with step by step instructions.English Version.

గోంగూర అంటే ఇష్టపడని వారుండరు. గుంటూరు  గోంగూర పచ్చడి రుచి ఎంత బాగుంటుంది. ఈ మధ్య రెస్టారెంట్ మెనూల్లో గోంగూరతో కలిపి వండిన వంటకాల్ని ఎక్కువగా చూస్తున్నాము. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర రైస్ ఇలా రకరకాల వంటకాలు బాగా పాపులర్ అయ్యాయి.

గోంగూర కోడిగుడ్డు కూర కూడా రుచికి ఏమాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది.హోటల్స్ లో ఇంకా టేక్ అవే సెంటర్ లలో కూరల్లో నూనె వేయరు, పోస్తారు. పులుపు రుచి బాగున్నా మరీ పుల్లగా ఉంటే తినలేము. ఆ పులుపును బ్యాలెన్సు చేయడానికే అంత నూనె పోస్తారేమో అని నేననుకుంటున్నాను. కానీ నేను మాత్రం అంత నూనె పోసి వండలేను.

నూనె అంత వాడే బదులు, ఆకును మరీ ఎక్కువగా కాకుండా కావల్సినంతే కూరలో ఉపయోగించాలి. పులుపు ను బ్యాలెన్స్ చేయడానికి కారం మామూలుగా కన్నా  కొద్దిగా ఎక్కువ వేయాలి.అప్పుడు కూర సరిగ్గా వస్తుంది.గోంగూర ను వేయించాక మరీ పేస్ట్ లా గ్రైండ్ చేయకుండా కాస్త పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చూడడానికి కూర టెక్స్చర్ బాగుంటుంది.

గోంగూర లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన గుడ్లలో కూడా చాలా పోషక విలువలుంటాయి. అందువల్ల వీలయినప్పుడల్లా ఈ కాంబినేషన్ వండుకోవడం మంచిది.పిల్లలకి లంచ్ బాక్స్ లో ఈ కూరని చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు.మీరు కూడా ఈ రెసిపీ ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Gongura Chicken Recipe in Telugu
Pachi Mamidikaya Chicken Fry Recipe in Telugu
Pandumirchi Chicken Fry Recipe in Telugu
Boiled Eggs Fry Recipe in Telugu
Mulakkada Royyala Curry Recipe in Telugu
Karivepaku Kodi kura Recipe in Telugu
Kodiguddu Mulakkada Tomato Curry Recipe in Telugu

Click here for the English Version of this Recipe

5 from 1 vote
Gongura Egg Curry Telugu Recipe
Prep Time
20 mins
Cook Time
30 mins
Total Time
50 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Author: బిందు
Ingredients
  • 150 నుండి 200 గ్రాములు గోంగూర
  • 6 ఉడకబెట్టిన గుడ్లు
  • 2 మీడియం ఉల్లిపాయల తరుగు
  • 6 లేదా 7 పచ్చిమిరపకాయలు
  • ½ tsp పసుపు
  • ఉప్పు తగినంత
  • 2 నుండి ౩ tbsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 2 ఏలకులు
  • 4 లవంగాలు
  • 1 అంగుళం దాల్చినచెక్క
  • tbsp+ 4 tbsp నూనె
  • ఎండుమిరపకాయలు
  • 1 కప్పు నీళ్ళు
Instructions
  1. పెనంలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయ ముక్కలు, బాగా శుభ్రంగా కడిగిన గోంగూర వేసి ఆకులు దగ్గర బడే వరకు వేయించాలి.
  2. స్టవ్ కట్టేసి కాసేపు చల్లారనిచ్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
  3. గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  4. కడాయిలో నూనె వేడి చేసి ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఎండుమిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  5. ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  7. పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
  8. ఉడికించి పెట్టుకున్న కోడి గుడ్లు వేసి ఒక సారి కలిపి సన్నని సెగ మీద ౩ నుండు 5 నిమిషాలు వేయించాలి.
  9. తర్వాత గోంగూర పేస్ట్ వేసి ఒక కప్పు నీళ్ళు కూడా పోసి బాగా కలపాలి.
  10. కూర దగ్గర బడే వరకు లేదా నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ కట్టేసుకోవాలి.

Gongura Egg Curry Telugu Recipe Video

Exit mobile version