Maatamanti

French Beans Tomato Curry Telugu Recipe

French Beans Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version.

నాకు అస్సలు నచ్చని కూరగాయలలో ఫ్రెంచ్  బీన్స్ ఒకటి. వెజిటేబుల్ పులావు లేదా కట్లెట్ లలో వేయడానికి ఇష్టపడతాను గానీ కూర చేయడం అసలు ఇష్టం ఉండదు. కానీ మా ఆయనకి ఫ్రెంచ్ బీన్స్ అంటే ఇష్టం. అందుకే నాకు ఇష్టం లేకపోయినా తన కోసం తయారు చేస్తుంటాను. బీన్స్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి నేను కూడా తినడం అలవాటు చేసుకున్నాను.

నేను మొదటి సారి ఫ్రెంచ్ టమాటో కూర వండినప్పుడు సరిగ్గా చేయలేకపోయాను. తెలీక బీన్స్ ఉడకక ముందే టమాటో ముక్కలు వేసేశాను. ఒక్కసారి టమాటో ముక్కలు వేస్తే ఇక అస్సలు ఉడకవు. ఒకవేళ ఉడికినట్లు కనిపించిన బీన్స్ ముక్కలు మెత్తగా లేకుండా కర కర లాడుతున్నట్లుగా ఉంటాయి. డైరెక్ట్ గా ప్రెషర్ కుకర్ లో వండితే ఉడుకుతాయేమో కానీ ఎంతైనా ఎంతైనా విడిగా గిన్నెలో వండిన రుచి మాత్రం రాదు.

అసలు బీన్స్ ని ముందుగానే నీళ్ళలో ఉడికించి పెట్టుకుని తర్వాత కూరలో వేస్తే కూర చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువగా సమయం లేని వారు ముందు రోజు రాత్రే బీన్స్ కి ఉన్న తీగ లాగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్ గా చేసేయ వచ్చు.

బీన్స్ టమాటో కూర కన్నా బీన్స్ ఫ్రై చాలా బాగుంటుంది.బీన్స్ టమాటో కూరను అన్నం లో కానీ చపాతీ, పుల్కా వంటి వాటితో తింటే బాగుంటుంది.ఫ్రెంచ్ బీన్స్ కూర ను పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టి ఇస్తే ఇష్టంగా తింటారు.మీరు కూడా ఈ రెసిపీ ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Palak Paneer Recipe in Telugu
Dondakaya Vepudu Recipe in Telugu
Thotakura Pesara Pappy Fry Recipe in Telugu
Methi Paneer Recipe in Telugu
Chamagadda Pulusu Recipe in Telugu
Alugadda Vepudu Recipe in Telugu

Click here for the English Version of the Recipe.

French Beans Tomato Curry Telugu Recipe
Prep Time
20 mins
Cook Time
30 mins
Total Time
50 mins
 
Course: Main Course
Cuisine: Indian
Author: బిందు
Ingredients
  • 300 grams ఫ్రెంచ్ బీన్స్
  • 2 మీడియం ఉల్లిపాయల తరుగు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 2 మీడియం టొమాటోలు
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ¼ tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 2 tsp కారం
  • ఉప్పు తగినంత
  • 4 లేదా 5 tbsp నూనె
  • ¼ cup కొత్తిమీర
Instructions
  1. కడాయి లో నూనె వేడి చేసి కాగాక ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించాలి.
  2. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. కారం వేసి కలిపి ఒక నిమిషం వేయించాలి.
  4. చిన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు వేసి ఒక సారి బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉంచి
  5. ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించాలి.
  6. మూత తీసి మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతుండాలి.
  7. ముక్కలు బాగా మగ్గి మెత్తబడ్డాక టమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి ఒకసారి కలపి మూత పెట్టి టొమాటోలు కూడా మగ్గే వరకు ఉడికించాలి
  8. కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేసుకోవాలి.

French Beans Tomato Curry Telugu Recipe Video

Related Post

Please Share this post if you like