Maatamanti

Dry Fruit laddu Telugu recipe-డ్రై ఫ్రూట్ లడ్డూ

Dry Fruit Laddu Telugu Recipe with step by step instructions.English Version.

డ్రై ఫ్రూట్ లడ్డూ ఇస్తే  వద్దనే వారుండరు.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.బయట స్వీట్ షాప్ లో కొనుక్కుంటే కేజీ డ్రై ఫ్రూట్ లడ్డూ ధర సుమారు 1200 నుండి 1500 రూపాయల వరకు ఉంటుంది.అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎక్కువలో ఎక్కువ 600 రూపాయలకు మించి ఉండదు.అందుకే బయట కొనుక్కునే కన్నా ఇంట్లో తయారు చేసుకోవడమే మేలు.ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలను ఎక్కువగా దీపావళి మరియు రంజాన్ పండుగ సందర్భాలలో తెలిసిన వారికి గిఫ్ట్ చేస్తుంటారు.

ఉపవాస సమయాల్లో దీనిని తీసుకుంటుంటారు.ఉపవాసం ప్రారంభించబోయే ముందు కానీ లేదా విడవగానే వీటిని తీసుకుంటే మంచిది.ఉపవాసానికి ముందు గనుక తీసుకుంటే కడుపు నిండినట్లుగా అనిపించి చాలా సేపటి వరకు అసలు ఆకలి అనిపించదు.ఉపవాసం ముగియగానే తీసుకుంటే తక్షణం శక్తినిస్తుంది.వెంటనే నీరసం పోతుంది.నాకైతే ఒక్క లడ్డూ తినగానే కడుపు నిండి పోతుంది.చాలా సేపటి వరకు అసలేమి తినబుద్ధి కాదు.

ఈ recipe మీరు తయారు చేయాలనుకుంటే మీకు ఇంట్లో అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ తోనే తయారు చేసుకోవచ్చు.నేను క్రింద ఇచ్చిన లిస్టు లోని అన్ని పదార్ధాలు వేయాల్సిన అవసరం లేదు.కానీ ఖర్జూరం మాత్రం తప్పని సరి.ఎందుకంటే లడ్డూలో మనం పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా కేవలం ఖర్జురాలలో సహజంగా ఉండే తీపినే వాడుతాము.ఏది పెట్టినా తినకుండా పేచి పెట్టే పిల్లలు కూడా మారం చేయకుండా ఇది తింటారు.పొద్దున్న ఒకటి సాయంత్రం స్కూల్ నుండి రాగానే ఒకటి ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu
Panakam Recipe in Telugu

Click here for the English Version of this recipe.

Dry Fruit Laddu Telugu Recipe
Course: Dessert
Cuisine: Indian
Author: బిందు
Ingredients
  • 200 g సీడ్ లెస్ ఖర్జూర
  • 50 గ్రాములు ఎండిన అంజీర్/అత్తి పండు
  • ¼ కప్పు లేదా 30 గ్రాములు బాదంపప్పులు
  • ¼ కప్పు లేదా 30 గ్రాములు జీడిపప్పు
  • 15 గ్రాములు గోల్డ్ కలర్ ఎండు ద్రాక్ష
  • 15 గ్రాములు నల్ల ఎండు ద్రాక్ష
  • ¼ కప్పు లేదా 30 గ్రాములు పిస్తా పప్పు
  • ¼ ముక్క జాజికాయ
  • ½ tsp గసగసాలు
  • 3 ఏలకులు
  • ¼ కప్పు నెయ్యి
Instructions
  1. విత్తులేని ఖర్జురాలను, ఎండు అంజీర ను చిన్నగా తరిగి వేరేగా పక్కన పెట్టుకోవాలి.
  2. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు లను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  3. ఏలకులు మరియు జాజికాయను కలిపి పొడి కొట్టాలి.
  4. తర్వాత తరిగి పెట్టుకున్న ఖర్జూర మరియు అంజీర ముక్కలను మిక్సీలో వేసి కచ్చాపచ్చా గ రుబ్బాలి.
  5. ఒక బాణలిలో నెయ్యి వేసి అది కరిగాక అందులో జీడి పప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు, ఎండు ద్రాక్షలను వేసి దోరగా వేయించాలి.
  6. ఖర్జూర & అంజీర పేస్ట్ మరియు జాజికాయ & ఏలకుల పొడిని కూడా వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి.
  7. ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచి కాసేపు ఆరనిచ్చి సమన భాగాలుగా చేయాలి.
  8. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టాలి.

Dry Fruit Laddu Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=L0fVyKPOXxc[/embedyt]

 

Related Post

Please Share this post if you like