Maatamanti

Crispy Chicken Fries Telugu Recipe-chicken fingers Telugu

Crispy Chicken Fries Telugu Recipe with step by step instructions.English Version.

KFC చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ఎప్పుడైనా  తినాలనిపిస్తే బద్దకంగా ఉన్నా చచ్చినట్లు తయారయి వెళ్ళాల్సిందే. హోమ్ డెలివరీ ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే మాత్రం ఇబ్బందే. అలాంటప్పుడు ఈ అతి సులువైన క్రిస్పీ చికెన్ ను తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో చికెన్ రెడీ గా ఉంటే చాలు. పావు గంటలో చేసేసుకోవచ్చు.

నేనైతే ఎప్పుడూ 1 kg బోన్ లెస్ చికెన్ తెప్పించుకొని ఫ్రీజర్ లో ఉంచుకుంటాను. కాకపొతే దానిని ఫ్రీజర్ లో పెట్టే ముందు శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి ఉంచుతాను. అలా రెడీ గా ఉంచుకుంటే చికెన్ తో  ఎప్పుడు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ చేసుకోవచ్చు. ఈ KFC స్టైల్ క్రిస్పీ చికెన్ ను నేను మా అమ్మాయి కోసం ఈవెనింగ్ స్నాక్ గా చేసిస్తుంటాను.

ఇంకా తేలికగా అంటే మీరు చికెన్ కు ఉప్పు, నిమ్మ రసం, మిరియాల పొడి వేసి పట్టించాక కాసేపు ఉంచి తర్వాత వాటిని ముందుగా బాగా గిల కొట్టిన గుడ్డు సొనలో ముంచి తర్వాత మైదా పిండి లో ముంచి తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో ముంచి అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలన్నింటిని ఒక ఫ్రీజర్ సేఫ్ కంటైనర్ లో ఉంచి ఫ్రీజర్ పెట్టుకోవాలి. తర్వాత మీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఒక 15 నిమిషాల ముందు తీసి బయట ఉంచి అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి.

మరీ పెద్ద ఫ్లేమ్ మీద కాకుండా మీడియం హై ఫ్లేమ్ మీద వేయించాలి. అలా చేయకపోతే వేసిన వెంటనే మాడిపోతాయి. చికెన్ ముక్కలను మరీ ఎక్కువ సేపు వేయిస్తే వాటిలో సహజంగా ఉండే తేమ పోయి గట్టిగా అయిపోతాయి. అందుకే ౩ నుండి 4 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. అప్పుడు బయట కరకరలాడుతూ లోపల చికెన్ మెత్తగా టేస్టీ గా ఉంటాయి.

నేను ఈ రెసిపీ కోసం panko బ్రెడ్ క్రంబ్స్ వాడాను. అవి అన్ని మెట్రో స్టోర్ లలో దొరుకుతాయి. ఒక వేళ అవి దొరకకపోతే మీరు నార్మల్ బ్రెడ్ క్రంబ్స్ వాడ వచ్చు. లేదా కార్న్ ఫ్లేక్స్ ను చిన్న చిన్న ముక్కలుగా పొడి కొట్టి వాటినైనా ఉపయోగించ వచ్చు. ఈ ఫ్రైస్ ని మయోన్నిస్ తో కానీ టమాటో కెచప్ తో గానీ లేదా గార్లిక్ సాస్ తో  తింటే బాగుంటాయి. ఉత్తిగా కూడా బాగుంటాయి. మీరు కూడా ఈ టేస్టీ Cripsy Chicken Fingers Recipe ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను. ఒక వేళ మీరు తయారు చేస్తే ఫీడ్ బాక్ ఇవ్వడం మర్చిపోకండి.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Chicken Shawarma Recipe in Telugu
Street Food Style Chicken Dosa Recipe in Telugu
Schezwan Chicken Thighs Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Pepper Chicken Recipe in Telugu
Karivepaku Chicken Curry in Telugu

Click here for the English Version of this Recipe.

Crispy Chicken Fries Telugu Recipe
Prep Time
30 mins
Cook Time
30 mins
Total Time
1 hr
 
Course: Snack
Cuisine: Global
Author: బిందు
Ingredients
మారినేషన్ కొరకు
  • 250 నుండి 300 గ్రాములు బోన్ లెస్ చికెన్
  • ఉప్పు తగినంత
  • ½ tsp మిరియాల పొడి
  • ½ చెక్క నిమ్మకాయ
కోటింగ్ కొరకు
  • 1 కప్పు బ్రెడ్ క్రంబ్స్
  • 1 కప్పు మైదా పిండి
  • 2 గుడ్లు బాగా గిలకొట్టినవి
  • 1 tsp కారం
  • ½ tsp ఒరేగానో
  • ½ tsp చిల్లీ ఫ్లేక్స్ (ఆప్షనల్)
వేయించుట కొరకు
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
చికెన్ ను మారినేట్ చేయుట
  1. చికెన్ ను ఒక జిప్ లాక్ బాగ్ లో కాని ప్లాస్టిక్ కవర్ లో కాని పెట్టి అప్పడాల కర్ర తో ఫ్లాట్ గా అయ్యే వరకు కొడుతూ ఉండాలి.
  2. తర్వాత వాటిని బయటకు తీసి పొడవైన సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. వాటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, సగం చెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
కోటింగ్ చేయుట
  1. రెండు గుడ్లను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
  2. బ్రెడ్ క్రంబ్స్ లో కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి.
  3. ఒక్కో చికెన్ ముక్కను ముందుగా గుడ్డు సొనలో ముంచి తర్వాత మైదా పిండి లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో అటూ ఇటూ తిప్పుతూ కలపాలి.
  4. ఇలా మొత్తం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
వేయించుట
  1. కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
  2. నూనె కాగాక మంటను మీడియం హై ఫ్లేమ్ కు తగ్గించి చికెన్ ముక్కలను మెల్లగా నునేలోకి జారవిడవాలి.

  3. ఒక్క 30 సెకన్లు కదల్చకుండా అలానే ఉంచి తర్వాత మెల్లగా అన్ని వైపులా తిప్పుతూ ౩ నుండి 4 నిమషాల పాటు వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.

Crispy Chicken Fries Telugu Recipe Video

 

Related Post

Please Share this post if you like