Site icon Maatamanti

Chamagadda Pulusu-చామగడ్డ పులుసు

chamagadda pulusu

Chamagadda Pulusu recipe with step by step instructions.English Version.

ఈ కూరని ఆంధ్రా లో ఒక విధంగా, తెలంగాణా ప్రాంతంలో ఒక విధంగా తయారు చేస్తారు.ఆంధ్రాలో అయితే చింతపండు పులుసు కూరలో వేసాక కొద్దిగా బెల్లం వేస్తారు.ఇలా చేయడం వల్ల కూర మరీ పులుపుగా లేకుండా చక్కని రుచి వస్తుంది.ఆ కూరలో కింద నేను చెప్పిన విధంగా ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, జీలకర్ర&మెంతుల పొడి వేయవలసిన అవసరం లేదు.మా అమ్మగారు ఈ పద్ధతిలో తయారు చేసేవారు.

తెలంగాణా ప్రాంతంలో ఈ కూరని నేను కింద చెప్పిన విధంగా తయారు చేస్తారు.నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను.అచ్చంగా చేపల కూర మాదిరే ఉంటుంది.ఒక్క కొబ్బరి తప్ప చేపల కూరలో ఏమేమి వేస్తారో అవే వేశాను.నా హస్బెండ్ కి, మా అమ్మాయికి ఈ కూరంటే ఎంతో ఇష్టం.

నేనెప్పుడూ చామగడ్డలను ముందే ఉడికించి తరవాత కూరలో వేస్తాను.నా వీడియో చూసిన  యూట్యూబ్ వ్యూయర్ ఒకరు “చామగడ్డలని ముందే ఉడికిస్తే మెత్తగా పేస్టులా అయ్యే ప్రమాదముంది.అందుకే ముందు వాటి పొట్టు తీసి కూరలో వేసాక అప్పుడు ప్రెషర్ కుక్ చేస్తే బాగుంటుంది ” అని చెప్పారు.తను చెప్పింది కూడా సరైన పద్దతే అయివుండవచ్చు.అప్పుడే కొత్తగా వంట చేయడం మొదలు పెట్టిన వారికి ముందే సరిగా ఉడికించడం రాకపోవచ్చు.

చేపల కూర మాదిరే ఈ కూర కూడా రెండో పూట ఇంకా రుచిగా ఉంటుంది.చామగడ్డలు రుచిగా ఉండడమే కాకుండా ఎన్నో విటమిన్లు,మినరల్స్ ను కలిగి ఉంటాయి.చాలా పోషక విలువలు కలిగి ఉన్న ఇవి  ఆరోగ్యానికి ఎంతో మంచివి.ఈ కూరని అన్నంతో గానీ, చపాతిలతో గానీ తింటే బాగుంటుంది.ఎంతో రుచికరమైన ఈ కూరని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Mushroom Khurma recipe in Telugu
Mulakkada Egg Tomato Curry in Telugu
Potato fry in Telugu
Ulavacharu Recipe in Telugu
Cauliflower Pachadi in Telugu

For the English Version of this recipe Click here.

5 from 1 vote
chamagadda pulusu
Chamagadda Pulusu-చామదుంప పులుసు
Prep Time
15 mins
Cook Time
45 mins
Total Time
1 hr
 
Course: Main Course
Cuisine: Andhra, Telangana
Author: బిందు
Ingredients
  • 250 గ్రాములు చామగడ్డ
  • 1 లేదా 180 గ్రాములు పెద్ద ఉల్లిపాయ
  • 3 పచ్చిమిరపకాయలు
  • 20 గ్రాములు చింతపండు
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 3 tsp కారం
  • ¼ tsp మెంతులు
  • ½ tsp జీలకర్ర
  • 1 tsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • 5 tbsp నూనె
  • 2 రెమ్మలు కరివేపాకు
  • ¼ కప్పు కొత్తిమీర
  • 600 ml నీళ్ళు
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 2 ఎండు మిరపకాయలు
Instructions
చామగడ్డలను ఉడకబెట్టుట
  1. చామగడ్డలను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో వేయండి.
  2. ప్రెషర్ కుక్కర్ లో చామగడ్డలు మునిగేదాకా నీళ్ళు పోసి మూత పెట్టాలి.
  3. హై ఫ్లేమ్ లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పొయ్యి కట్టేయ్యాలి. ప్రెషర్ పోయేవరకు ఆగాలి.
  4. కుక్కర్ మూత తెరిచి ఉడకబెట్టిన చామగడ్డలని మంచి నీళ్ళ లో వేయాలి.చామగడ్డల పైన తోలు తీసి పక్కన ఉంచుకోవాలి.
చింతపండు రసం తాయారు చేసుకునే విధానం.
  1. 20 గ్రాముల చింతపండుని 600 ml నీళ్ళ లో 10 నుంచి 15 నిముషాలు నానబెట్టాలి.
  2. చింతపండు రసంని పిండుకొని పక్కన ఉంచుకోవాలి..
జీలకర్ర&మెంతుల పొడి తయారు చేసుకునే విధానం.
  1. ఒక చిన్న పెనాన్ని వేడి చేసి, అందులో జీలకర్ర మరియు మెంతుల్ని వేసి చక్కని సువాసన వచ్చే వరకు వేయించాలి.
  2. తరవాత వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
కూర వండే విధానం.
  1. ఒక పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి.
  2. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
  3. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  4. కారం, ధనియాలపొడి వేసి కలపాలి.
  5. ముందుగా ఉడికించి పెట్టుకున్న చామగడ్డలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.
  6. మూత తెరిచి ఒకసారి కలిపి చింతపండు రసం పోయాలి.
  7. జీలకర్ర&మెంతుల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కూర చిక్కబడేవరకు ఉడికించాలి.
  8. కొత్తిమీర తరగు వేసి పొయ్యి కట్టేసుకోవాలి.

Chamagadda Pulusu Video

[embedyt] https://www.youtube.com/watch?v=lqNjLwm3D_U[/embedyt]

 

Exit mobile version