Site icon Maatamanti

Cauliflower Pachadi-క్యాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానం

cauliflower pachadi

Cauliflower Pachadi recipe with step by step instructions.English Version. cauliflower pachadi మొన్న విజయవాడ మా పిన్ని గారింటికి వెళ్ళినపుడు morning వాక్ కి వెళ్లాము.అక్కడ పచ్చటి చేల మధ్య నడుస్తూ వెళ్తుంటే ఎంతో హాయిగా అనిపించింది.ముందు ఒక అందమైన చెరువు పక్కనుండి నడుస్తూ కొంత దూరం వెళ్ళాక అక్కడ పసుపు చేలు ఉన్నాయి.అవి కూడా దాటాక క్యాలిఫ్లవర్ తోటలు కనిపించాయి.అక్కడ మాత్రం ఫ్రెష్ ఎయిర్ కన్నా pesticides వాసనే ఎక్కువగా వచ్చింది.క్యాలిఫ్లవర్ కి పురుగుమందులు వాడకం తప్పనిసరి అనుకుంటా.అన్ని మందులు కొట్టినా మనం కొనుకున్న కాలీఫ్లవర్లో పురుగులు ఉంటూనే ఉంటాయి.అక్కడ కూలీలు తెల్లవారుజామునే వచ్చి కోత మొదలుపెట్టారు.మేము కాసేపు అక్కడే ఆగిపోయి ఆ సుందరమైన దృశ్యాల్ని చూస్తూ ఉండిపోయాము.ఎన్నో ఫోటోలు తీసుకున్నాము.అక్కడే కాలీఫ్లవర్ పూలు ఒక్కోటి రూ.7 చొప్పున కొన్నాము.

ఈ క్యాలిఫ్లవర్ పచ్చడి 2 నుండి 3 రోజులు మాత్రమే నిలవ ఉంటుంది.. ఎందుకంటే ఈ cauliflower pachadi కోసం ముక్కల్ని నూనెలో వేయించము కాబట్టి.ఇంకా నిమ్మరసం కూడా పిండడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంచలేము.కానీ  ఫ్రిజ్ లో అయితే 2 వారాల వరకు నిలవ ఉంటుంది.ఈ తరహా పచ్చడిని ఎక్కువగా పెళ్ళిళ్లలో లేదా హోటళ్ళలో తయారు చేస్తూ ఉంటారు. దీని తయారీ కోసం ముందుగా క్యాలిఫ్లవర్ ముక్కల్ని 15 నిమిషాల పాటు ఉప్పు వేసిన వేడి నీళ్ళలో నాననివ్వాలి.ఇలా చేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి.ఇంకా పురుగు మందు అవశేషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.15 నిమిషాల తర్వాత ఆ నీళ్ళలో నుండి తీసివేసి మళ్ళీ మామూలు నీళ్ళలో ఒకసారి కడగాలి.అలా కడిగిన ముక్కల్ని ఒక అరగంట పాటు ఎండలో పెట్టి తడి లేకుండా ఆరనివ్వాలి.ఎండ లేకపోతే కనుక పొడి బట్టతో శుభ్రంగా తుడిచి సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి.

ఈ పచ్చడి ని వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటుగా వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది.అసలయితే ఈ పచ్చడిని తయారుచేసిన రోజు నాకు ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల నోరంతా చేదుగా ఉంది.కాస్త పచ్చడి వేసుకుని తిన్నాను.క్యాలిఫ్లవర్  ముక్కలు పుల్ల పుల్లగా తగులుతుంటే నోటికి అప్పుడు రుచి తెలిసింది.అల్లం ముక్కలు కుడా ఎంతో రుచిగా అనిపించాయి.నేనేప్పుడు ఈ పచ్చడిలో అల్లం ముక్కలు,పచ్చిమిరపకాయలు వేయలేదు.అలా వేస్తే చాల బాగుంటుందని మా నాయనమ్మ ఫోన్ లో చెప్పింది.అందుకే వేశాను.ఎంతో రుచిగా ఉండే నోరూరించే ఈ పచ్చడిని మీరు కుడా తయారు చేసుకొని ఆ కమ్మని రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

Click here for the English version of this recipe

you may also like

Homemade Ulavacharu recipe in Telugu
Veg Cutlets recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe in Telugu
Andhra Mamidikaya nilava Pachadi Recipe in Telugu
Pandumirapakaya pachadi Andhra style Recipe in Telugu
Boiled Eggs Fry Recipe in Telugu

Cauliflower pachadi
Prep Time
45 mins
Cook Time
15 mins
Total Time
30 mins
 
Course: Side Dish
Cuisine: Andhra, Indian
Author: Bindu
Ingredients
Pachadi koraku
  • 250 గ్రాములు క్యాలిఫ్లవర్ ముక్కలు
  • 1/4 కప్పు కారం
  • 1 tsp ఉప్పు
  • 1 tsp పసుపు
  • 1/4 tsp వేయించిన మెంతుల పొడి
  • 4 గబ్బాలు వెల్లుల్లి
  • 2 లేదా 3 నిమ్మకాయలు
  • 1 inch నిలువుగా సన్నగా చీల్చిన అల్లం
  • 4 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి
తాలింపు కొరకు
  • 1/4 కప్పు నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 3 ఎండుమిరపకాయలు
  • 2 రెమ్మలు కరివేపాకు
Instructions
శుభ్రం చేయుట
  1. క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఉప్పు వేసిన వేడి నీళ్ళలో వేసి 15 నిమిషాల పాటు ఉంచాలి.

  2. తర్వాత ఆ నీటిని వంపేసి మళ్ళీ ఒకసారి కడగాలి.

  3. ముక్కల్ని శుభ్రమైన బట్టతో తడి లేకుండా తుడిచి ఒక 30 నిమిషాల పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టి ఆరనివ్వాలి.

పచ్చడి తయారీ
  1. ఒక గిన్నెలో క్యాలిఫ్లవరు ముక్కల్ని వేసి అందులో కారం, పసుపు, ఉప్పు, మెంతి పిండి, వెల్లుల్లి ముద్ద, నిమ్మ రసం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.

తాలింపు
  1. నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి.

  2. తర్వాత చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి నాలుగు సెకెన్ల పాటు వేయించి తీసేయాలి.

  3. తాలింపులో పచ్చడిని కలిపి ఒక 2 నుండి 3 గంటల పాటు ఊరనివ్వాలి.

Cauliflower Pachadi recipe Video

Exit mobile version