Site icon Maatamanti

Boiled Eggs Fry Recipe Telugu- ఉడికించిన కోడిగుడ్ల వేపుడు

Boiled Eggs Fry Recipe Telugu step by step instructions.English Version.

చికెన్ ఫ్రై కి ఏమాత్రం తీసిపోకుండా చాలా రుచిగా ఉండే వంటకం ఈ ఉడికించిన కోడిగుడ్ల వేపుడు.బాగా ఆకలి గా ఉన్నప్పుడు వెంటనే, అతి తక్కువ సమయంలో చేసుకోదగిన అతి సులువైన వంటకం ఇది.కొత్తగా పెళ్లై అప్పుడప్పుడే వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన అమ్మాయిలకు, బాచిలర్స్ కు ఈ వంటకం ఉపయోగపడుతుంది.ఎక్కువ పదార్ధాలు లేవు కాబట్టి  తేలికగా తయారు చేసేయవచ్చు.

ఇదే వేపుడులో ఎండు రొయ్యలు కానీ రొయ్య పొట్టు కానీ వేసి వండితే కూడా చాలా బాగుంటుంది.ఎండు రొయ్యలను శుభ్రం చేసి ఇసుక లేకుండా కడిగి ఒక 5 నిమిషాల పాటు నీళ్ళలో ఉడికించి, నీళ్ళు వడకట్టేసి అప్పుడు రొయ్యలను కూరలో వేసుకోవాలి.అప్పుడప్పడు వంకాయలు కూడా వేసి వండుతాను.అది కూడా బాగుంటుంది.కానీ టైం సరిపోదు కాబట్టి ఎక్కువగా ఈ కింది పద్ధతిలోనే వండుతాను.ఎంతో రుచికరమైన వంటకాన్ని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Spicy Fish Fry Recipe in Telugu
Andhra Chicken Fry Recipe in Telugu
Maamidikaya Chicken Recipe in Telugu
Nellore Chepala Pulusu Recipe in Telugu
Karivepaku kodi kura Recipe in Telugu
Naatukodi pulusu Recipe in Telugu

Click here for the English version of this Recipe

5 from 1 vote
Boiled Eggs Fry Recipe in Telugu
Prep Time
15 mins
Cook Time
30 mins
Total Time
45 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Indian
Servings: 4
Author: బిందు
Ingredients
  • 4 కోడి గుడ్లు ఉడికించినవి
  • 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా నిలువుగా తరిగినవి
  • 3 పచ్చిమిరపకాయలు
  • 1 tbsp అల్లంవెల్లుల్లి ముద్ద
  • 1 రెమ్మ కరివేపాకు
  • ¼ tsp పసుపు
  • 2 tsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • 2 tbsp కొబ్బరి పొడి
  • ఉప్పు తగినంత
  • 4 లేదా 5 tbsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర
Instructions
  1. కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
  2. కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
  4. ఉడికించిన గుడ్లను సగానికి కోసి కూరలో వెయ్యాలి.
  5. గరం మసాలా, కొబ్బరి పొడి వేసి ఇంకొకసారి కలపాలి.
  6. మూత పెట్టి 3 నుండి 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాలి.
  7. మూత తెరిచి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవాలి.

Boiled Eggs Fry Recipe Telugu Video

[embedyt] https://www.youtube.com/watch?v=1pnsGlaMv4E[/embedyt]

Exit mobile version