Site icon Maatamanti

Banana Balls Telugu Recipe -బనానా బాల్స్ తయారీ విధానం

banana balls telugu recipe

Banana Balls Telugu Recipe with step by step instructions.English Version.
banana balls telugu recipe

ఈ వంటకాన్ని నేను ఒక TV ప్రోగ్రాం లో చూసి తయారు చేసాను.నేను మగ్గిన అరటిపండ్లు, పంచదార, మైదా, ఎండు కొబ్బరిపొడి  వేసి పిండి కలిపి తయారు చేసారు.టీవీ లో చెప్పిన దాంట్లో కాస్త పెరుగు కూడా వేసారు, కొబ్బరి పొడి వేయలేదు.నేను పెరుగు వేయకుండా చేసినా చాలా బాగా వచ్చాయి.రుచికి అచ్చు బనానా muffins లానే ఉన్నాయి.మా పాప, మా ఆయన చాలా ఇష్టంగా తిన్నారు.ఇవి చల్లని వాతావరణంలో రెండు రోజుల వరకు నిలవ ఉంటాయి.కాబట్టి ఒక్కసారే కొద్దిగా ఎక్కువ చేసి పెట్టేసుకుంటే పిల్లలకి స్నాక్స్ లా మధ్య మధ్యలో ఇస్తుండవచ్చు.అవసరమైతే ఫ్రిజ్ లో కూడా నిలవ చేసుకోవచ్చు.

మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి తో చేసుకోవచ్చా అని కొంతమంది Youtube viewers అడిగారు.గోధుమ పిండి తో చేస్తే fluffy గా రాకపోవచ్చు.గట్టిగా ఉంటాయి.అదే మైదా పిండితో చేస్తే చక్కగా స్పాంజ్ లా వస్తాయి.ఈ recipe లో చక్కెరకు బదులు బెల్లం వేసుకోవచ్చు.కొబ్బరి పొడి వేయకపోయినా పర్వాలేదు.ఇవి కేరళ వారు చేసే ఉన్ని ఆప్పం recipe లా ఉంటాయి.నూనె లో వేయిస్తే నూనె ఎక్కువగా పీలుస్తాయనుకుంటే పనియారం పాత్రలో కొద్దిగా నెయ్యి రాసి, పిండిని వేసి వీటిని తయారు చేసుకోవచ్చు.అలా కూడా చాలా బాగా వచ్చాయి.కానీ నాకు నూనె లో వేయించినా కొంచెం కూడా నూనె పీల్చలేదు.ఈ recipe ని ఎలా చేయాలి కింద video లో చూసి తెలుసుకోవచ్చు.ఎంతో రుచికరమైన ఈ బనానా బాల్స్ ని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Flax seeds Laddu recipe in Telugu
Kharbuja Pulla Ice Recipe in Telugu
Onion Murkulu Recipe in Telugu
Homemade Bounty Chocolate recipe in Telugu
Parle-G Biscuit Cake Recipe in Telugu

Click here for the English version of this recipe.

Banana Balls Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
30 mins
Total Time
45 mins
 
Course: Dessert, Snack
Cuisine: Indian, Kerala
Ingredients
  • 2 అరటిపండ్లు , బాగా పండినవి
  • 1 కప్పు లేదా 120 గ్రాములు మైదాపిండి
  • 3 tbsp ఎండు కొబ్బరి పొడి
  • 1/3 లేదా ½ కప్పు పంచదార
  • 1 tsp యాలకుల పొడి
  • డీప్ ఫ్రై కి సరిపడా నూనె
  • 1 tbsp నెయ్యి
Instructions
పిండి తయారీ విధానం
  1. అరటిపండును ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
  2. మిక్సీ లో పంచాదారి వేసి పొడి కొట్టుకోవాలి.
  3. అందులోనే అరటిపండు ముక్కలను కూడా వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
  4. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. అందులో మైదా పిండి, యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి.
బనానా బాల్స్ తయారు చేయుట
విధానం-1
  1. కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి, కాగనివ్వాలి.
  2. నూనె కాగాక అందులో చిన్న నిమ్మకాయంత పరిమాణంలో పిండిని ఉండలుగా తీసుకొని మెల్లిగా జారవిడవాలి.
  3. అన్ని వైపులా తిప్పుతూ సమంగా ఉడికేటట్లుగా మీడియం సెగ మీద వేయించాలి.
  4. వేయించిన వాటిని పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
విధానం – 2
  1. పనియారం కడాయి తీసుకొని, గుంతలలో కొద్దిగా నెయ్యి పూయాలి.
  2. గుంతలలో పిండిని నింపి, మూత పెట్టి సన్నని సెగ మీద ఉడికించాలి.
  3. మూత తెరచి రెండవ వైపు కూడా తిప్పి ఉడికించాలి.అప్పుడు కూడా కొద్దిగా నెయ్యి వేయాలి.

Banana Balls Telugu Recipe Video

Exit mobile version