Site icon Maatamanti

Useful Kitchen Tools Telugu ||కొన్ని ఉపయోగపడే కిచెన్ గాడ్జెట్స్

చూడడానికి చిన్న చిన్న వస్తువుల్లా ఉన్నా మన పనిని సులభం చేసే కొన్ని  కిచెన్ పనిముట్లు లేదా టూల్స్  గురించి వివరిస్తూ మీకు వాటికి సంబంధించిన లింక్ లను ఇస్తాను.

సిలికాన్ గ్రిప్స్

వంట చేసే టప్పుడు వేడి గా ఉన్న పాత్రల్ని పట్టుకోవడానికి మనం క్లాత్ ను ఉపయోగిస్తాము.  వాటి మీద తరచుగా కూర మరకలు, నూనె మరకలు పడతాయి. ఒక్కోసారి దానినే కిచెన్ అరుగును తుడవడానికి కూడా వాడుతూ ఉంటాము. దీని వల్ల దాని మీద ఎన్నో క్రిములు ఉంటాయి. ఆ క్లాత్ ను అలాగే మళ్ళీ మళ్ళీ ఉపయోగించకూడదు. ప్రతి రోజూ ఖచ్చితంగా ఉతకాలి. నేనయితే ఆ క్లాత్ ను వేడి వేడి మరిగే నీళ్ళల్లో Dettol వేసి 20 నిముషాలు నానబెట్టి ఆ తర్వాత ఉతికేదాన్ని. అలా రెండు మూడు క్లాత్స్ ను మార్చి మార్చి వాడుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే సమయం సరిపోవడం లేదో అప్పుడు ఆన్లైన్ లో ఈ మసి గుడ్డ కు ప్రత్యామ్నాయం ఏదైనా ఉందేమో అని చూస్తుండగా ఇవి దొరికాయి. 3 సంవత్సరాల నుండి ఇవి వాడుతున్నాను. మా తాతగారు పొలం లో వండిన జీడి పప్పు కూర అప్పుడు ఆయన  వీటిని మొదటిసారి ఉపయోగించారు. ఆయనకవి బాగా నచ్చాయి. అదేదో నేనే తయారు చేసినట్లు నన్ను తెగ మెచ్చుకున్నారు. అసలిలాంటివి ఉన్నాయని నీకెలా తెలుసు అనడిగారు. వాళ్లకు కూడా ఆ సిలికాన్ గ్రిప్స్ కొనిచ్చాను వారు తిరిగి వెళ్ళేటప్పుడు. ఇవి వాడడం చాలా తేలిక శుభ్రం చేసుకోవడం ఇంకా తేలిక. వాటితో వేడి గిన్నెని పట్టుకున్నా కాలదు. ఏదైనా మరకలు పడినా వెంటనే కడిగేస్తే పోతుంది. ఉతికి ఆరబెట్టాల్సిన బాధ లేదు. ఎక్కువ ఖరీదు కూడా కాదు. వాటి లింక్ ఇస్తున్నాను చూడండి.
.

వెజిటెబుల్ ఛాపర్

ఇది కూడా చిన్నదే కానీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యారెట్, బీట్రూట్, సొరకాయ, బీరకాయ లాంటివి చిన్నగా సన్నగా తరగాలి అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న డబ్బా లా ఉంటుంది. పైన ఉన్న మూతలో చుట్టుకుని ఉన్న తాడు ఉంటుంది. ఆ తాడుని లాగడానికి ఒక చిన్న హేండిల్ ఉంటుంది.దాన్ని పట్టుకు రెండు మూడు సార్లు లాగితే కింద డబ్బాలో ఉన్న బ్లేడ్లు తిరగడం వల్ల కూరగాయలు సన్నగా తరిగినట్లు అవుతాయి. ఒక వేళ మరీ సన్నగా వద్దు అంటే ఎక్కువ లాగ కుండా ఆపేయాలి. దీంట్లో తరిగితే ఉల్లిపాయ వల్ల కళ్ళ లో నీరు వస్తాయన్న బాధ ఉండదు. ఒక్కోసారి ఉల్లిపాయలు మనం కోస్తే ఇంట్లో ఉన్న మిగతా వారికి కూడా ఆ ఘాటు తగులుతుంది కదా. ఆ బాధ కూడా ఉండదు. అయితే బెండకాయ, వంకాయ వంటి వాటిని దీనిలో తరగలేము. నేను పీజియన్ బ్రాండ్ కొన్నాను. కొన్ని రోజులు వాడాను. అది కూడా మా నానమ్మ తాతగారు వచ్చినప్పుడు వాళ్లకి ఇచ్చేశాను. వారు 2 సంవత్సరాలు వాడాక పైన మూతలో ఉన్న తాడు తెగిపోయింది అని బయట బాగుచేయించుకోవడం వీలవుతుందా అని అడిగారు..మా తాతగారు ఫోన్ లో. అది వీలవదేమో మళ్ళీ ఆయన దాని కోసం బయటకి ఎక్కడకు వెళ్తారులే అని ఇంకోటి అమెజాన్ లో ఆర్డర్ చేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి డెలివరీ ఇచ్చేట్లుగా ఆర్డర్ చేశాను. ఇప్పటికీ అదే వాడుతున్నారు. కడగడం కూడా చాలా సులువు. నేను మొదటి సారి కొన్నప్పుడు 2 బ్లేడ్స్ మాత్రమే ఉన్న వెర్షన్ ఉండేది. రెండోసారి కోనేప్పటికి 3 బ్లేడ్స్ వెర్షన్ వచ్చింది. అది ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి ఇది చాలా మంది వాడుతూ ఉంటారు. నేను మాత్రం నానమ్మ వాళ్ళకి ఇచ్చేశాక ఇంకోటి నా కోసము కొనలేదు. ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ ఛాపర్ ఉంది అందుకని కొనలేదు. పీజియన్ బ్రాండ్ లో గ్రీన్ మరియు గ్రే కలర్స్ ఉన్నాయి. గ్రీన్ మోడల్ లో L, XL మరియు స్టాండర్డ్ అని మూడు సైజుల్లో ఉన్నాయి. మీ కుటుంబ పరిమాణాన్ని బట్టి ఏది కావాలో అంటే అది తీసుకోవచ్చు.

.

కిచెన్ నైఫ్

నన్ను కామెంట్స్ చాలా మంది అడిగే ప్రశ్న. లింక్ ఇవ్వమని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను ఎక్కువగా వాడే గ్రీన్ కత్తి ని చూసి. అది నేను ఆన్లైన్ లో కొనలేదు. కొండాపూర్, శరత్ సిటీ మాల్ లో ఉన్న డాన్యూబ్ హోమ్ షాప్ లో కొన్నాను. అది 149 rs మాత్రమే. దానితో పాటు అలాంటివే ఇంకో రెండు చిన్నవి కూడా రంగు కత్తులు కొన్నాను. ఒకటి గ్రే రంగు, ఇంకోటి పర్పుల్ రంగు. అవి ఒక్కోటి 49 rs. ఇంత చవకగా వచ్చాయి అసలు తెగుతాయో లేదో అయినా పర్లేదు ఒకసారి ట్రై చేసి చూద్దాం అని తెచ్చాను. 3 కత్తులు మూడు సార్లు నా రక్తం కళ్ళ చూశాయి.😆😅. కొయ్యక ముందే తెగిపోయేంత షార్ప్ గా ఉంటాయి. మళ్ళీ పొలం లో ఇంటి కోసం కొందాము అని లాక్ డౌన్ ఎత్తేయగానే మా ఆయన్ను పంపాను తెమ్మని. కానీ అవి దుబాయ్ నుండి వస్తాయి అట. ఈ కరోనా వల్ల ప్రొడక్ట్స్ రాలేదు అని చెప్పారు. అలాంటివే ఆన్ లైన్ లో ఉన్నాయేమో చూశాను. కానీ ఆవి కాస్త ఖరీదు ఎక్కువ. సెట్ లా వస్తుంది. 4 ఉంటాయి. ఆ లింక్ ఇస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు కొంటే వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. వేళ్ళు కోసుకుని నన్ను తిట్టుకోకండి ప్లీజ్.ఇంకోటి నేను కుండ లో చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఉపయోగించిన రాకింగ్ నైఫ్ గురించి కొంతమంది అడిగారు. అది కూరగాయల్ని రఫ్ చాప్ చేయడానికి మాంసాన్ని మిన్స్ అంటే కీమా లా చేయడానికి, పిజ్జా కట్ చేయడానికి వాడొచ్చు. దాని లింక్ కూడా ఇస్తాను చూడండి.

కిచెన్ కేబినెట్ డోర్ హ్యాంగింగ్ డస్టబిన్

మా హోమ్ టూర్ లేదా కిచెన్ టూర్ వీడియో చూసి నన్ను కొంతమంది అడిగిన ప్రశ్న ” మీ వీడియో లో డస్ట్ బిన్ కనపడలేదు. ఎక్కడ పెట్టావు” అని. ఏ రోజైతే డస్ట్ బిన్ వల్ల బొద్దింకలు అట్ట్రాక్ట్ అవుతాయి అని పెస్ట్ కంట్రోల్ అతను చెప్పాడో ఆ రోజు నుండి నేను కిచెన్ లో అసలు ఇంట్లోనే డస్ట్ బిన్ పెట్టడం మానేశాను. వంట చేసేటప్పుడు వచ్చే చెత్త కోసం ఈ కింద ఉన్న పింక్ రంగు మోడల్ డస్ట్ బిన్ కొన్నాను. దానిని కిచెన్ క్యాబినెట్ డోర్ కి తగిలించుకోవచ్చు. కూరగాయల చెత్త కోసేయగానే అందులోకి తోసేస్తాను. వంట అయిపోయిన వెంటనే అది తీసుకెళ్లి బయట కారిడార్ లో ఉన్న ఇంకో డస్ట్ బిన్ లో పెట్టేస్తాను. మరుసటి రోజు ఉదయం చెత్త తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. మా వంట గది అంతా తెల్లగా ఉంటుంది కదా ఈ పింక్ రంగు నాకు నచ్చలేదు. తెల్ల రంగు పంపమని సెల్లర్ కి మెయిల్ పెట్టాను. తెల్లదే పంపించారు. కింద ఉన్న లింకుల్లో మొదటి దాని కన్నా రెండోది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అసలదే కొందాము అనుకున్నాను కనీ రంగు మ్యాచ్ అవదు అని కొనలేదు. నేను కొన్నది వాడేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత కౌంటర్ కి దగ్గరగా నిల్చోవాలి అనుకున్నప్పుడు అడ్డుగా అనిపిస్తుంది. రెండోది అలా కాదు. అది collapsible. అంటే పని అయిపోగానే నెడితే లోపలికి ముడుచుకున్నట్లుగా అయిపోతుంది. అడ్డు రాదు. అయితే నేను దాన్ని వాడలేదు కాబట్టి ఎక్కువగా చెప్పలేను. ఆ మోడల్ ను ఎక్కువ మంది కొన్నట్లుగా కూడా అమెజాన్ లో రివ్యూస్ లేవు. రెండోది మీరు కొనాలి అనుకుంటే కొద్దిగా రిస్క్ చేసి కొనాలి.

.

మిల్క్ ఫ్రోథెర్

రోజు మొత్తం ఎలా అఘోరించినా పర్లేదు కానీ ఉదయం మాత్రం సంతోషంగా చిరు నవ్వుతో నిద్ర లేవాలి. ఈ రోజు బతికే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్పాలి. మన భారాన్ని మోస్తున్నందుకు భూమాతకు క్షమాపణ చెప్పాలి. తర్వాత అందమైన సూర్యోదయాన్ని చూస్తూ ఒక కమ్మని కాఫీ తాగాలి. నేనయితే రోజంతా తినకుండా ఉండగలను కాఫీ మాత్రం తప్పని సరి. రోజంతటిలో నా పర్సనల్ లైఫ్ లో నేను అనుభూతి చెందే సమయం ఒక్క కాఫీ తాగే సమయం మాత్రమే. అందుకే కాఫీ ని చాలా శ్రద్దగా పెట్టుకుంటాను. కాఫీ చక్కగా వేడిగా పొగలు కక్కుతూ ఉండాలి. నురుగు ఉండాలి. ఇంతకు ముందు కాఫీ నురుగు కోసం తిరగేసేదాన్ని రెండు సార్లు అటూ ఇటూ. కానీ అలా తిరగేసే సరికి కాఫీ ఆరిపోయేది. అప్పుడు మిల్క్ frother కొనుక్కున్నాను. కాఫీ కప్పులోకి పోయగానే ఒక్కసారి దీన్ని కాఫీ లో పెట్టి ఒక మూడు  సెకన్లు ఆన్ చేసి ఉంచితే చాలు. కాఫీ చక్కగా కలిసిపోయి నురుగు వచ్చేస్తుంది. పైన కొద్దిగా కాఫీ పౌడర్ చల్లుకుంటే చక్కగా రోజూ స్టార్ బక్స్,  కాఫీ డే లాటి కాఫీ షాప్స్ లో దొరికే లాంటి కాఫీ తాగొచ్చు. అయితే ఇది ఖచ్చితంగా అవసరమైన వస్తువు అని మాత్రం చెప్పను. మీ రోజులో మీకు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేదాని మీద ఆధారపడి ఉంటుంది.

మెషరింగ్ కప్స్

ఈ మధ్య అందరూ యూట్యూబ్ లో చూసి రకరకాల వంటలు చేయడం మొదలు పెట్టారు కదా. యూట్యూబ్ లో రెసిపీస్ చెప్పేవారు ఎక్కువగా కప్పులు టీ స్పూన్, టేబుల్ స్పూన్ లాంటి కొలతలతో చెప్తూ ఉంటారు. అలాంటివి చూసి చేసేటప్పుడు మీకు ఇవి ఉంటే పని తేలికవుతుంది. ఆన్లైన్ లో కాకపోయినా దాదాపు అన్ని సూపర్ మార్కెట్లలో ఇవి తేలిగ్గా దొరుకుతాయి. వెళ్లినప్పుడు తెచ్చుకోవచ్చు. సాధ్యమైనంత వరకు స్టీల్ వి కొనడానికి ప్రయత్నించండి. వుడెన్ మెషరింగ్ కప్స్ దొరుకుతాయేమోనని నేను నా కోసం వెతికాను. కానీ మన ఇండియా లో లేవు.

 

చెక్క పోపుల పెట్టె

నన్ను ఎక్కువ మంది అడిగిన లింక్స్ లో ఇది కూడా ఒకటి. మా కిచెన్ టూర్ లో చూసి చాలా మంది అడిగారు. లింక్ కూడా చాలా మందికి ఇచ్చాను. పోపుల పెట్టె వాడితే చెక్కది కానీ, స్టెయిన్ లెస్ స్టీల్ కానీ, ఇత్తడి ది కానీ వాడితే బాగుంటుంది. నేను వాడే పోపుల పెట్టె లింక్ కింద ఇస్తున్నాను. అందులో పార్టీషన్స్ ఉంటాయి. విడి విడి చిన్నపెట్టెలు లేవు.  ఒకటేదైనా అయిపోతే దాన్ని శుభ్రం చేయాలి అంటే అంత తేలిక కాదు. ఇప్పుడు వేరేవి కూడా వచ్చాయి. వాటిలో చిన్న చిన్న విడి చెక్క పెట్టెలు ఉంటాయి ఏది కావాలి అంటే అది బయటకి తీసి కడిగి మళ్ళీ పెట్టుకోవచ్చు, కొన్న వెంటనే 3-4 సార్లు లోపల పాలిష్ అంతా పోయేవరకు శుభ్రంగా కడగాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు.

.

కిచెన్ కౌంటర్ ఆర్గనైజర్

మా కిచెన్ లో కౌంటర్ మీద నూనె బాటిల్స్ ఇంకా ఉప్పు, కారం పెట్టిన ఆర్గనైజర్ లింక్ కింద ఇస్తున్న్నాను చూడండి. ఇది కూడా నన్ను చాలా మంది అడిగారు. ఒక వేళ మీరు కొనాలి అనుకుంటే ముందు దాని సైజు సరిగ్గా చూసుకోవాలి. మీ ఇంట్లో ముందే ఉన్న జార్స్ పెద్దగా ఉంటే మళ్ళీ అందులో పట్టవు. అందుకే సరిగ్గా చూసి కొనుక్కోవాలి. అమెజాన్ లో కింద ఆల్రెడీ కొన్న వారు పెట్టిన ఫొటోస్ ఉంటాయి. అవి చూస్తే కొంచెం అర్ధం అవుతుంది. నాకు ఆ ఫొటోస్ చూస్తే ఒక్కోసారి విపరీతంగా కోపం వస్తుంది. ఆర్గనైజర్ లో కూడా  అన్ ఆర్గనైజ్డ్ గా  పెట్టుకుంటారు😆😅. అర్జెంటు గా వాళ్ళింటికి వెళ్లి సర్ది రావాలి అనిపిస్తుంది. సరే ఈ కింద నేను వాడుతున్న కిచెన్ ఆర్గనైజర్స్ లింక్స్ ఇస్తున్నాను చూడండి. మొదటిది నేను మా కిచెన్ కిటికీ లో పెట్టిన మనీ ప్లాంట్స్ పెట్టడానికి వాడాను. దానిని కిటికీ గ్రిల్స్ కి తగిలించి అందులో ప్లాంటర్ పాట్స్ పెట్టాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు అందులో పెట్టాలి అనుకున్న జార్స్ కానీ, ప్లాంటర్ పాట్స్ కానీ సైజు చూసుకుని ఇందులో పడతాయి అనుకుంటేనే కొనుక్కోవాలి. రెండోది నేను ఆయిల్ డిస్పెన్సెర్ బాటిల్స్ పెట్టి కౌంటర్ మీద పెట్టాను. దీనికి ఉన్న పెయింట్ పౌడర్ కోటింగ్ ఉంటుంది. త్వరగా ఊడిపోయే అవకాశం ఉంది. నాకు ఖచ్చితంగా తెల్లది కావాలి కాబట్టి ఇది కొన్నాను. ఒక వేళ రంగు పోయినా మళ్ళీ 20 rs ల పెయింట్ డబ్బా తెచ్చి వేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో. ఇవే ఆర్గనైజర్స్ ని నేను Home సెంటర్ షాప్ లో కూడా చూశాను. వీలయితే అక్కడ కొనుక్కోండి. ఇంక మూడోది పాన్ ఆర్గనైజర్. పాన్స్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సైజులో ఉంటాయి. 3-4 పాన్స్ ఉంటాయి. అవి నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉండాలి అంటే ఇవి వాడితే బాగుంటుంది. వీటిని నిలువుగా పెట్టుకోవచ్చు. లేదా అడ్డంగా పెట్టి కూడా వాడుకోవచ్చు. నేను gas stove కింద ఉన్న drawer లో ఇది పఅడ్డంగా పెట్టి అందులో పాన్స్ పెట్టాను. నా కిచెన్ టూర్ వీడియో లో కనిపిస్తుంది. నేను ఇచ్చిన లింక్ ఆర్గనైజర్ అడ్జస్టబుల్ ఉంటుంది. అన్ని పాన్లు ఒకే సైజులో ఉండవు కదా. సైజు ను బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు.


Utensil Holder

Marble Dust bowls

Shaker Jars set of 3

salt and Pepper jars

Coffee Jar

Flour jar

Pasta Jar

Pulses Jar

Sugar Jar

Tea Canister

Untensil

Measuring Cups

Rice Jar

నన్ను ఎక్కువగా అడిగింది వీటి గురించే.. నేను కిచెన్ కిటికీలో పెట్టిన టీ, బిస్కెట్స్, షుగర్ డబ్బాలు గురించి అడిగారు. ఆన్లైన్ లో వెతికాను. దొరకలేదు. నేను వాటిని ఆన్లైన్ లో కొనలేదు. KPHB సుజనా ఫోరమ్ మాల్ లో Spar  పక్కన ఉన్న Market 99 షాప్ లో కొన్నాను. మెషరింగ్ కప్స్,  కాబినెట్ డోర్ హ్యాంగింగ్ డస్ట్ బిన్ ఎవరూ అడగలేదు. నేనే చెప్పాను. ఎందుకంటే అవి మీకు బాగా ఉపయోగపడతాయి నాకు అనిపించింది. నేను ఏదైనా లింక్ ఇవ్వడం మర్చిపోయి ఉంటే నాకు గుర్తు చేయండి.  నేను చెప్తాను.

మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ ఇక్కడ రాశాను సమయం ఉన్నప్పుడు చదవండి.

మనకి ఉపయోగపడే కొన్ని ఫుడ్ ప్రొసెసర్స్ వివరాలు ఇక్కడ ఇచ్చాను చూడండి.

ఎలాంటి వంట పాత్రలలో వండితే మంచిదో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలాంటి జ్యూసర్లు వాడితే మంచిది అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version