Site icon Maatamanti

Blogging in Telugu- బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?

telugu blogging

బ్లాగ్గింగ్! బ్లాగ్గింగ్…. ఈ మధ్య తరచుగా ఈ మాట చాలా మంది నోట వివిపిస్తుంది.అయితే “అసలు బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?దానిని ఎలా మొదలు పెట్టాలి?” లాంటి ప్రశ్నలు మొదలవుతాయి.అలాంటి ప్రశ్నలన్నింటికి నాకు తెలిసినంత వరకు మీకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

What is Blogging – బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?

మనకు బాగా తెలిసిన విషయాలను చక్కటి పదాలతో వ్యాస రూపంలో ఇంటర్నెట్ ను మాధ్యమంగా ఉపయోగించి రాయడమే బ్లాగ్గింగ్.ఇక్కడ చక్కటి పదాలు అంటే ఏ గ్రాంధిక భాషో లేక అతి కష్టమైన, క్లిష్టమైన సాహిత్య పరమైన పదాలు అని అనుకుంటే అది పొరబాటే.మనం మాములుగా మాట్లాడుకునే వ్యావహారిక భాషలోనే రాయవచ్చు.కాకపొతే తప్పులు లేకుండా, అర్ధవంతంగా, పాఠకులను ఆకర్షించే విధంగా ఉంటే చాలు.మీరు రాసిన పదాలలో భావ వ్యక్తీకరణ అనేది చాలా ముఖ్యమైనది.అంటే ఫీల్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేవి అవసరం.అలా అయితేనే పాఠకులు మళ్ళీ మళ్ళీ మీ బ్లాగ్ ని విజిట్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

బ్లాగ్గింగ్ చేయాలంటే ఏమి కావాలి?

Blogging చేయాలంటే మంచి కంటెంట్ కావాలి.ఎందుకంటే “కంటెంట్ ఈజ్ కింగ్” కాబట్టి.ఉదాహరణకు మీరు ఒక కూరలో ఎన్ని రకాల మసాలాలు వేసి ఘుమ ఘుమ లాడేటట్లుగా వండినా సరిపడా ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుందో సరయిన కంటెంట్ లేని బ్లాగ్ కూడా అలానే ఉంటుంది.అందుకే బ్లాగ్గింగ్ మొదలు పెట్టాలి అని అనుకున్నపుడు ముందు మీ బ్లాగ్ సబ్జెక్ట్ ఏంటి అనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి.ఆ సబ్జెక్ట్ మీకెంత పట్టు ఉంది?మీరు మాత్రమే రాయగలరా లేదా ఇంకొకరి సహాయం తీసుకోవాల్సి వస్తుందా?ఒకవేళ సహాయం తీసుకోవాల్సి వస్తే వారు సరైన సమయానికి బ్లాగ్ ఆర్టికల్స్ అందిచగలరా?ఒకవేళ అందిస్తే ఉచితంగా ఇస్తారా లేక కొంత మొత్తం పే చేయాలా అనేది తెలుసుకోవాలి?నా సలహా అయితే ముందు బ్లాగ్గింగ్ ను ఉచిత వనరులు (రిసోర్సెస్) సహాయంతో ప్రారంభించడమే మంచిది.

Blogging ను ఎలా మొదలు పెట్టాలి?

ఒక personal computer, ఇంటర్నెట్ సౌకర్యం, ఈ మెయిల్ ఐడి, అన్నిటికన్నా ముఖ్యంగా బుర్రలో కాస్త స్టఫ్ ఉంటే అప్పటికప్పుడు బ్లాగ్ ను పది నిమిషాల్లోనే మొదలు పెట్టవచ్చు.మొదలు పెట్టే ముందు సరయిన బ్లాగ్గింగ్ platform ని నిర్ణయించుకోవాలి.ఇప్పుడు అనేక ఉచిత platforms అందుబాటులో ఉన్నాయి.వాటిలో కొన్ని

బ్లాగ్గింగ్ ను వృత్తిగా మార్చుకోవచ్చా?

పై ప్రశ్న కు నా సమాధానం 100 % అవుననే చెప్తాను.కానీ మొదలు పెట్టిన వెంటనే ఆదాయం రాదు కాబట్టి ముందు మీరు మాములుగా చేస్తున్న ఉద్యోగాన్నే కంటిన్యూ చేస్తూ తీరిక సమయంలో బ్లాగ్గింగ్ చేయవచ్చు.Blogging టెక్నిక్స్ మీద  కాస్త అవగాహన ఏర్పడ్డాక, కాస్త ఆదాయం మొదలయ్యాక దానిని ఫుల్ టైం ప్రొఫెషన్ గా కూడా మార్చుకోవచ్చు.లేదా మీకు మంచి భాషా పరిజ్ఞానం ఉండి, సంబంధిత విషయం మీద పట్టు ఉంటే మీరు తీరిక వేళల్లో పార్ట్ టైం గా  వేరే  బ్లాగ్గర్స్ కు మీ కంటెంట్ ను contribute చేయవచ్చు.ఆ విధంగా కూడా మీరు ఆదాయం పొందవచ్చు.ఉదాహరణకు మీకు మొబైల్స్, మొబైల్ accessories, ఇంకా అధునాతన gadjets గురించి బాగా పరిజ్ఞానం ఉండి వాటి గురించిన సమీక్ష చేయగలిగితే మీరు బ్లాగ్ పోస్ట్స్ రాయవచ్చు.కొత్త మొబైల్ కొనుక్కోవాలనుకుని ఏది కొనాలో తెలీక తికమక పడేవారికి, మొబైల్ లో  ఏదైనా సమస్య వచ్చి troubleshoot చేసుకోవాలనుకునే వారికి  మీ ఆర్టికల్ ఉపయోగపడవచ్చు.మీరు రాసిన వ్యాసం వారికి ఉపయోగకరంగా ఉంటే వారే దాన్ని సోషల్ మీడియాల్లో కృతజ్ఞతాపూర్వకంగా షేర్ చేస్తారు.మళ్ళీ మళ్ళీ మీ బ్లాగ్ ను విజిట్ చేస్తారు.

బ్లాగ్గింగ్ ను ఎవరు మొదలు పెట్టవచ్చు?

కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి కాస్త భాష మీద పట్టు ఉన్నవారెవరైనా  మొదలు పెట్టవచ్చు.గంటలు గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి, నానా తిప్పలు పడి ఆఫీసుకి చేరుకొని, అక్కడ అర్ధరాత్రి వరకు పనిచేసి విసిగిపోయే బదులు ఇలా ఎంచక్కా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసి ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించవచ్చు.అలా అని బ్లాగ్గింగ్ చాలా సులువనుకునేరు.అది కూడా చాలా కష్టమైన పనే.blogging చేయాలంటే చాలా సహనం ఉండాలి.ఫలితాల గురించి ఎదురు చూడకుండా నిరంతరం కంటెంట్ ను అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఉద్యోగమైతే మీరు ఇంకొకరి కింద పనిచేయాలి. బ్లాగర్ గా ఉంటే మీకు మీరే యజమాని.మీరు ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు.సరిగ్గా concentrate చేయ గలిగితే ఒక హై లెవెల్ లో ఉన్న  software ప్రొఫెషనల్ ఒక నెల జీతం కన్నా ఎక్కువే సంపాదించవచ్చు.

బ్లాగ్గింగ్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు అసలు బ్లాగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.బ్లాగ్ కి వెబ్ సైట్ కి తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి.

Exit mobile version