Site icon Maatamanti

Schezwan Chicken Thighs – షేజువాన్ చికెన్ థైస్ తయారీ విధానం

schezwan chicken thighs

Schezwan Chicken Thighs Recipe with step by step instructions.English Version.schezwan chicken thighs

షేజ్వాన్ చికెన్ చాలా రుచికరమైన చైనీస్ వంటకం.కాస్త కారంగా, ఘాటుగా ఉన్నా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.మన దేశంలో అయితే దీనిని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్ లలో ఎక్కువగా తయారు చేస్తారు.ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అమ్మేవారు చికెన్ ను కాస్త ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు.ఎవరైనా కస్టమర్స్ వచ్చి వారికి కావాల్సింది అడిగినప్పుడు దానికి సంభందించిన పదార్ధాలని జోడించి మళ్ళీ పెనంలో పెద్ద మంట మీద  క్షణాల్లో వేపి ఇచ్చేస్తారు.చైనీస్ వంటకాలను సాధారణంగా ఒక మందపాటి లోతైన పెనంలో పెద్ద మంట మీద చేస్తారు.ఆ పెనాన్ని వోక్  అంటారు.అలా పెద్ద మంట మీద వండడం వల్ల పదార్ధాలకు smokey ఫ్లేవర్ పట్టడంతో పాటు చక్కటి రుచి కూడా వస్తుంది.

పోయిన వారం ఆన్లైన్లో మీట్ కోసం చెక్ చేస్తుంటే ఈ చక్కటి చికెన్ థైస్ కనిపించాయి.వెంటనే ఆర్డర్ చేశాను.ముందు పాన్ ఫ్రైడ్ గార్లిక్ చికెన్ చేద్దామనుకున్నాను.అందుకే ముందే చికెన్ ముక్కలకు వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టుకున్నాను.కానీ తీరా వండబోయే సమయానికి మా అమ్మాయి షేజ్వాన్ చట్నీ వేసి వండమని చెప్పింది.తను ఏదో ఇంగ్లీష్ ఫుడ్ ఛానల్ లో చెఫ్ చికెన్లో వైన్ ఇంకా schezwan చట్నీ వేయడం చూసిందట.అందుకే “మనం కూడా అలానే చేద్దాం” అమ్మా అని చెప్పింది.కాకపొతే వైన్ కి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ వేయమని చెప్పింది.అలా కూడా వేయొచ్చని మా అమ్మాయికి తెలిసినందుకు నాకు చాలా ముచ్చటేసింది.అందుకే నాకు తెలిసినా తెలీనట్లు నటించి తను చెప్పేది విన్నాను.

మా అమ్మాయి మరీ ఎక్కువ కారం తినలేదు కాబట్టి ఈ recipe లో నేను 2 tbsp ల షేజ్వాన్ చట్నీ మాత్రమే వేశాను.కానీ మీరు 1/4 కప్ కానీ ఇంకా ఎక్కువ గానీ వేసుకోవచ్చు.చికెన్ ముక్కలను వేయించేటప్పుడు పెద్ద మంట  మీద వేయించాలి.అప్పుడు చట్నీ అడుగంటుతుంది.అలా అడుగంటిన దాన్ని మాడకుండా గీరుతూ వేయించాలి.ఇలా చేయడం వల్ల చక్కని రుచి వస్తుంది.ఇదే recipe ని మీరు మామూలు బోన్ లెస్ చికెన్ ముక్కలతో కూడా చేసుకోవచ్చు.శాకాహారులైతే పనీర్ తో కూడా చేసుకోవచ్చు.ఎంతో రుచికరమైన నోరూరించే ఈ వంటకాన్ని మీరు కూడా తయారు చేసుకొని ఆ రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

 

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Mamidikaaya Chicken Fry recipe in Telugu
Karivepaku Chicken Curry in Telugu
Andhra Chicken Fry in Telugu
Naatu Kodi Pulusu recipe in Telugu
Chicken Liver Fry recipe in Telugu
Chicken Tikka Pulao recipe in Telugu

Click Here for the English version of this recipe.

షేజ్వాన్ చికెన్ థైస్
Prep Time
30 mins
Cook Time
20 mins
Total Time
50 mins
 
Servings: 2
Author: బిందు
Ingredients
  • 400 గ్రాములు చికెన్ థై పీసెస్
  • 1 tsp ఉప్పు
  • 10 వెల్లుల్లి రెబ్బలు చిన్నవి
  • 3 tbsp ఆలివ్ నూనె
  • 1 tbsp ఆపిల్ సైడర్ వెనిగర్
  • 3 tbsp షేజువాన్ చట్నీ
  • ½ tsp తెల్ల నువ్వులు
  • 1 tbsp కొత్తిమీర తరుగు
Instructions
  1. వెల్లుల్లి రెబ్బల్ని పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి.
  3. చికెన్ లో ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ బాగా పట్టేలా కలిపి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  4. ఒక మందపాటి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక అందులో నానబెట్టిన చికెన్ ముక్కలు వేయాలి.
  5. రెండు వైపులా తిప్పుతూ ఒక 5 నుండి 7 నిముషాల పాటు వేయించాలి.
  6. తరవాత మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు రెండు వైపులా తిప్పి వేయించాలి.
  7. మూత తెరచి, 1 tbsp ఆపిల్ సైడర్ వెనిగర్ వేయాలి.
  8. తర్వాత 3 నుండి 4 tbsp షేజువాన్ చట్నీ వేసి పెనాన్ని తిప్పుతూ ముక్కల్ని టాస్ చేయాలి.
  9. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద వేయించుతూ చికెన్ ముక్కలు చక్కగా రోస్ట్ అయ్యేలా వేయించాలి.
  10. షేజువాన్ గ్రేవీ కొద్దిగా అడుగంటేలా కానీ మాడకుండా వేపి స్టవ్ కట్టేయాలి.
  11. ముక్కల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని, పెనంలో మిగిలిన షేజువాన్ గ్రేవీ ముక్కల మీద పడేలా పోయాలి.
  12. ½ tsp తెల్ల నువ్వులు ముక్కల మీద జల్లి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి హాట్ గా సర్వ్ చేయాలి.

Schezwan Chicken Thighs Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=fhCwxbw0oKQ[/embedyt]

Exit mobile version