Maatamanti

Pandumirchi Chicken Fry Telugu Recipe/పండుమిర్చి చికెన్

Pandumirchi Chicken Fry Telugu Recipe with step by step instructions.English Version.

నేను పండుమిర్చి కోడి వేపుడు రెసిపీ చేయడం రెండో సారి.మొదటి సారి చేసినప్పుడు అంత బాగా కుదరలేదు.బాగా కారంగా ఉండి కూర పచ్చి వాసన అనిపించింది.కాస్త ఘాటుగా కూడా అనిపించింది.ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ చేయ కూడదు అనుకున్నాను.కానీ మొన్నీమధ్య ఒక రెస్టారెంట్ మెనూ లో చూశాక మళ్ళీ ఇంకొక సారి ట్రై చేసి చూడాలనిపించింది.

ఈసారి చేసేటప్పుడు కొంచెం శ్రద్ధగా, జాగ్రత్తగా చేశాను.టేస్ట్ మాత్రం సూపర్.తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ.మొదటి సారి చేసినప్పుడు మామూలుగా చికెన్ కూరలో వేసేంత నూనె మాత్రమే వేసాను.కానీ ఈసారి అలా కాకుండా కాస్త నూనె మామూలు కన్నా ఎక్కువ వేశాను.అలా వేయడం వల్ల పండు మిర్చి లోని ఘాటు బ్యాలెన్స్ అవుతుంది.ఫస్ట్ టైం చేసినప్పుడు పండు మిర్చి పేస్ట్ వేశాక కొద్ది  సేపు మాత్రమే వేయించాను.అందుకే పచ్చి వాసన వచ్చింది.ఈసారి అలా కాకుండా 10 నుండి 12 నిమిషాలు పచ్చి మిర్చి పేస్ట్ లోని తడి అంతా పోయి నూనె కూర అంచులకు తేలే వరకు వేయించాను.అందువల్ల పచ్చి వాసన అస్సలు రాలేదు.పైగా అది చికెన్ తో కలిపాక ముక్కలకు బాగా పట్టుకొని మంచి రుచి వచ్చింది.

కారంగా తినడం ఇష్ట పడే వారికి ఈ కూర బాగా నచ్చుతుంది.చిన్న పిల్లలకి అయితే ఇది పెట్టక పోవడమే మంచిది.నేను ఈ కూరతో పాటు కొత్తిమీర కోడి పులావ్ కూడా చేసాను.రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది.త్వరలోనే కొత్తిమీర కోడి పులావ్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను.మీరు కూడా ఈ రెసిపీ ని తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.ఒక వేళ ఈ రెసిపీ నచ్చితే తప్పక share చేయగలరు.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Restaurant style Chicken Majestic Telugu Recipe
Chicken Tikka Pulao Telugu Recipe
Chicken Biryani in Pressure Cooker Telugu Recipe
Methi Chicken Recipe in Telugu
Chicken Dum Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu

Click here for the English Version of the Recipe

మరిన్ని తెలుగు recipe videos కొరకు మా  youtube ఛానల్ ను విజిట్ చేయండి.

Pandumirchi Chicken Fry Telugu Recipe
Prep Time
1 hr
Cook Time
40 mins
Total Time
1 hr 40 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Servings: 4
Author: BINDU
Ingredients
మారినేషన్ కొరకు
  • 350 గ్రాములు చికెన్
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 tbsp పెరుగు
చికెన్ ఫ్రై కొరకు
  • 1 పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్
  • 6 నుండి 7 పండు మిరపకాయలు
  • 1 మీడియం టమాటో
  • 7 నుండి 8 tbsp నూనె
  • 2 దాల్చిన చెక్క అరంగుళం ముక్కలు
  • 3 లవంగాలు
  • 3 ఏలకులు
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ½ tsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • 1 రెమ్మ పుదీనా ఆకులు
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • 8 నుండి 10 వేయించిన జీడిపప్పులు
Instructions
మారినేషన్
  1. ఒక మిక్సింగ్ బౌల్ లోకి చికెన్ ముక్కలు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.
గ్రైన్డింగ్
  1. పండు మిరపకాయలు మరియు టమాటో ను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి స్మూత్ పేస్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
పండు మిర్చి చికెన్ ఫ్రై
  1. ఒక పెనంలో నూనె వేడి చేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  2. ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించాలి.
  4. తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి అందులో నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి.
  5. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి.
  6. మూత తెరిచి ఒకసారి కలిపి అందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా ఆకులు వేసి ఒక రెండు నిమిషాలు సిమ్ లో ఉంచాలి.
  7. చివరిగా కొత్తిమీర తరుగు, వేయించిన జీడిపప్పు వేసి స్టవ్ కట్టేయాలి.

Pandumirchi Chicken Fry Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=7w7AzYMnDyM[/embedyt]

 

Related Post

Please Share this post if you like